హెచ్1బీ కొత్త విధానంతో అమెరికాకే తీవ్రనష్టం
విదేశీ నిపుణులను అమెరికా కంపెనీలు ఆహ్వానించి ఉద్యోగాలు ఇచ్చే ‘హెచ్1బీ’ వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన నిబంధనలు పెట్టి అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించేలా కొత్త చట్టాలు చేసింది. ఈ కొత్త విధానంతో నష్టం అమెరికా? లేక ఇండియా, చైనా సహా ఆ దేశానికి వెళ్లే మేధావులైన నిపుణులకా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తాజాగా హెచ్1బీపై ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు సంస్థలు కోర్టుకు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ‘హెచ్1బీ’ నిబంధనలు కీడు చేస్తాయని అక్కడి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
అసలు అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎదిగిదంటే అది ఖచ్చితంగా నిపుణులైన విదేశీ మేధావులు అమెరికాకు వచ్చి అక్కడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్లేనన్న వాదన ఉంది. దీంతో ట్రంప్ నిర్ణయంపై 17 దిగ్గజ అమెరికా సంస్థలు, సంఘాలు ఉత్తర కొలంబియా కోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి.
ట్రంప్ కొత్త విధానంతో నైపుణ్యం కలిగిన వారు అమెరికాకు రారని.. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఈ వీసా విధానం అవరోధంగా మారుతుందని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.
అమెరికా ఫస్ట్ నినాదం ట్రంప్ హెచ్1బీ వీసాలపై కఠిన నిబంధనలు పెట్టాడు. అమెరికన్లకే అధికంగా ఉద్యోగాలు లభించేలా.. అత్యధిక స్కిల్ ఉన్న నిపుణులకు మాత్రమే అమెరికాలో ఉద్యోగాలు దక్కేలా వీసా విధానంలో మార్పులు చేశారు.దీనిపై ఆర్థిక , వాణిజ్య సంస్థలు కోర్టుకు ఎక్కాయి. మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.