నెహ్రూ చేసిన ఆ తప్పును రాజ్యసభలో ఎత్తి చూపిన కేంద్రమంత్రి

Update: 2022-03-24 08:33 GMT
ఒక బాలీవుడ్ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. అనూహ్య చర్చకు తెర తీసింది. చరిత్రలోకి వెళ్లేలా చేసి.. కొత్త వాదనల జోరును పెంచింది. చరిత్ర పుటల్లో జరిగిన దారుణాల్ని ఎత్తి చూపించటమే కాదు.. ఇన్నాళ్లుగా ఈ అంశంపై మౌనంగా ఉన్న వారిని వేలెత్తి చూపేలా చేసింది. ఇలాంటి వేళ.. కశ్మీర్ పై గత పాలకులు చేసిన తప్పులు ఏమిటన్న కొత్త చర్చ ఒకటి మొదలైంది.

ఇదిలా ఉంటే.. కశ్మీర్ ను దేశానికి సంబంధించిన సమస్యగా కాకుండా అంతర్జాతీయ సమస్యగా మార్చిన తీరుకు కారణం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూగా ఆరోపించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.

తాజాగా రాజ్యసభ లో మాట్లాడిన ఆమె.. నెహ్రూ వైఖరి కారణంగానే కశ్మీర్ సమస్యకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత లభించేలా చేశారన్నారు. నిజానికి ఈ అంశం అంతర్జాతీయ ఇష్యూగా మారకుండా ఉండాల్సిందన్నారు.

భారత్ - పాక్ మధ్య జరిగిన తర్వాత.. 1948 జనవరిలో కశ్మీర్ సమస్యపై నెహ్రూ ఐక్యరాజ్యసమితిలో పిటిషన్ వేశారని.. అప్పట్నించి ఈ అంశం అంతర్జాతీయ ఇష్యూగా మారిందన్నారు.

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐక్యరాజ్య సమితి ఒక కమిషన్ ఏర్పాటు చేసిందని.. దాన్ని పాకిస్థాన్ ఇప్పటికి వాడుకుంటుందన్నారు.

కశ్మీర్ ఇష్యూను అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు బహుశా బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన సలహాయే కారణం కావొచ్చన్న వాదనను నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. ఏమైనా.. నెహ్రూ హయాంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో మోడీ సర్కారు ఇటీవల కాలంలో దూకుడు పెంచటం గమనార్హం.
Tags:    

Similar News