దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ కావాలి

Update: 2021-01-25 05:42 GMT
ఏక భారతదేశం.. దేశంలో అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు సమానం.. కానీ ఇప్పుడు ప్రాంతీయ అసమానత దేశంలో మెల్లిమెల్లిగా పురివిప్పుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉత్తరాదికే పెద్దపీట వేస్తూ దక్షిణాదికి నిధులు, నియామకాలు, అత్యున్నత పదవుల్లో మొండి చేయి చూపడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

ఇప్పుడు ఈ సెగ దక్షిణాదికి పాకింది. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల చైర్మన్లు డిమాండ్ చేశారు.

ఈ అంశంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ, కేరళ, తమిళనాడు బార్ కౌన్సిళ్ల చైర్మన్లు వెబినార్ నిర్వహించారు.

సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు అంశం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని కోరారు.
Tags:    

Similar News