నాసా అలెర్ట్: భూమి వైపునకు దూసుకొస్తున్న అతిపెద్ద గ్రహశకలం

Update: 2021-06-02 03:30 GMT
అతిపెద్ద గ్రహశకలం భూమి వైపునకు దూసుకొస్తుందని నాసా గుర్తించింది. ఈ ఆస్టరాయిడ్ తో పెను ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. జూన్ లో భూమికి చేరువయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే దీనివల్ల భూమికి పెను ముప్పు వాటిల్లుతుందా? జీవజాలంపై ప్రభావం చూపుతుందా? అనే అంశాలపై పరిశోధనలు చేపట్టింది. 186 మీటర్ల పరిమాణంలో ఉండే ఈ ఉల్క భూమి దగ్గర నుంచి వెళ్లనుందని నాసా తెలిపింది.

భూమి, చంద్రుల మధ్య దూరం కన్నా 20 రెట్ల దూరంలో ఈ గ్రహ శకలం ఉన్నట్లు గుర్తించింది. జూన్ 1 నుంచి 2 మధ్యలో 72 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలదని అంచనా వేసింది. మే 31 నుంచి జూన్ 1 వరకు భూమికి చేరవలో వచ్చే ఐదు ఆస్టరాయిడ్లలో కేటీ1 గ్రహశకలం ప్రమాదకరమైందని నాసా భావిస్తోంది. దీని గమనంపై పూర్తి దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

మిగిలిన నాలుగు గ్రహశకలాలతో పెద్దగా ప్రమాదం లేదని అభిప్రాయపడింది. అవి చిన్న ఇళ్ల పరిమాణంలో, విమానం సైజులో ఉన్నాయని పేర్కొంది. ఆ ఉల్కల వల్ల ఎలాంటి నష్టం జరగదని అంచనా వేసింది. 150 మీటర్ల కన్నా పెద్దగా ఉన్న గ్రహశకలాలతోనే ముప్పు వాటిల్లుతుందని నాసా తెలిపింది. అంతేకాకుండా 75 లక్షల కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే ఉల్కలు చాలా ప్రమాదకరమని స్పష్టం చేసింది. 66 మిలియన్ ఏళ్ల క్రితం ఓ భారీ గ్రహశకలం భూమిని తాకిందని ప్రస్తావించింది. ఆ సమయంలో జీవజాలానికి చాలా నష్టం వాటిల్లిందని గుర్తు చేసింది. అందులో చాలా జీవులు అంతరించిపోయాయని పేర్కొంది.
Read more!

ప్రస్తుతం పెను ప్రమాదం అయితే ఏం లేదని నాసా స్పష్టం చేసింది. ఈ గ్రహశకలం భూమి చేరవలోకి వస్తుంది కానీ భూమి మీద పడే అవకాశం లేదని పేర్కొంది. ఇక అలాంటి అవకాశాలు ఉన్నా ఎదుర్కొనే సాంకేతికత నాసా దగ్గర ఉంది. ఇప్పటికే చిన్న చిన్న ఉల్కల వల్లే భూమి చాలా దెబ్బతిన్నది. ఇలాంటి అతిపెద్ద గ్రహశకాలు వస్తే ప్రమాదమని అభిప్రాయపడింది. ఇలాంటి విపత్తులను ముందుగానే గుర్తించి నివారించగలిగే సాంకేతికత ఉన్నందన గతంలోని పరిస్థితులు పునరావృతం కావని వెల్లడించింది.
Tags:    

Similar News