మరికాసేపట్లో ఇంద్రకీలాద్రి పైకి సీఎం జగన్ .. విరిగి పడ్డ కొండ చరియలు !

Update: 2020-10-21 15:30 GMT
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.ఈ సమయంలో ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగి కిందపడ్డాయి. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి , బీటలు వారి కొండ చరియలు విరిగి కింద పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే దీంతో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు కూడా అధికారులు ఏర్పాటు చేసారు. అయితే , తాజాగా కొండచరియలు విరిగి కిందకి దొర్లాయి. దీనితో పలువురు భక్తులు గాయపడ్డారు.

అయితే, కొండచరియల కింద భక్తులున్నారో లేదో ఆలయ అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇటీవల వర్షాలకు తరచూ కొండచరియలు విరిగిపడుతుండడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. మౌన స్వామి ఆలయం వద్ద ఉన్న కొండకు పగుళ్లు పట్టడంతో చిన్నచిన్న రాళ్ళు విరిగిపడుతున్నాయి. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని వర్షం పడినప్పుడు చిన్న చిన్న రాళ్ళు విరిగిపడడం సహజమే అని దుర్గగుడి ఇంజినీర్ భాస్కర్ అంటున్నారు. ప్రస్తుతం దర్శనం నిలిపివేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. కొండపైకి ఎవరిని అనుమతించడం లేదు. మరికాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మీడియా పాయింట్ దగ్గరలోనే ఈ కొండచరియలు విరిగిపడ్డాయి.
Tags:    

Similar News