టీమిండియా కొత్త కెప్టెన్ రేస్ లో అతడికే ఛాన్స్?

Update: 2021-11-09 04:15 GMT
విరాట్ కోహ్లీ వయసు 34. ఈ వయసులో రిటైర్ అయ్యే అవకాశం లేకున్నా.. కోహ్లీ ఫిట్ నెస్ అద్భుతంగా ఉన్నా.. జట్టును విజయాల వైపు నడిపించలేకపోతున్నందుకు ఖచ్చితంగా అతడు తనకు తానుగా తప్పుకుంటున్నారు. ఇప్పుడు కోహ్లీ వారసుడు ఎవరన్నది అసలు ప్రశ్న.

విరాట్ కోహ్లీ తర్వాత అందరూ రోహిత్ శర్మ కెప్టెన్ కావాల్సిందేనంటున్నారు. ఎందుకంటే రోహిత్ ఇటు ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు చాంపియన్ గా నిలిపాడు.ఇక కోహ్లీ గైర్హాజరీలో 8 కప్ లకు కెప్టెన్ గా ఆడితే 5 విజయాలను అందించాడు.

సో ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రేసులో అందరికంటే ముందున్నాడు మన రోహిత్ శర్మ. అయితే ఈ ప్రపంచకప్ తో దిగిపోతున్న కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి తర్వాత అపర ద్రోణాచార్యుడిగా పేరుపొందిన రాహుల్ ద్రావిడ్ పగ్గాలు అందుకుంటున్నారు. అతడు ఇప్పటికే భారత్ ఏ, అండర్ 19 జట్టును అగ్రపథాన నిలిపాడు. ఇప్పుడు టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే కోహ్లీతో సమానమైన వయసున్న రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేందుకు ద్రావిడ్, బీసీసీఐ సిద్ధంగా లేదని సమాచారం. యువకుడైన కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ ఇవ్వొచ్చని అంటున్నారు. అదే జరిగితే కోహ్లీ వారసుడిగా కేఎల్ రాహుల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News