బాబు బ్యాచ్‌ భారీగా సోష‌ల్ వంట‌కాలు!

Update: 2018-03-18 06:17 GMT
ఓప‌క్క ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇప్పుడు మ‌రో పెద్ద క‌స్టం వ‌చ్చి ప‌డింది. నిన్న‌టి వ‌ర‌కూ స్నేహితుడిగా ఉండి.. ఉన్న‌ట్లుండి ప్ర‌త్య‌ర్థిగా మారిన ప‌వ‌న్ తో పెద్ద త‌ల‌నొప్పే వ‌చ్చి ప‌డింది. బాబు బ్యాచ్ కు జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి కావ‌టంతో ఆయ‌న చేసే విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. కంటెంట్ ఎప్ప‌టిక‌ప్పుడు రెఢీ చేసే ప‌రిస్థితి.

అందుకు భిన్నంగా. ఫ్రెండ్ గా ఉన్న ప‌వ‌న్ ఉన్న‌ట్లుండి విమ‌ర్శ‌ల అంకుశం తీసి పొడుస్తుంటే.. బాబు బ్యాచ్ విల‌విల‌లాడుతోంది. ప‌వ‌న్ పై పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసేందుకు బాబు బ్యాచ్ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న యాక్టివ్ అవుతోంది. ఏ యాంగిల్ లో ప‌వ‌న్ పై దాడి చేయాల‌న్న అంశంపై ప‌లు బ్యాచ్ లు రంగంలోకి దిగిన‌ట్లు చెబుతున్నారు.

ప‌వ‌న్ పై సోష‌ల్ మీడియాలో దాడితో బ‌ద్నాం చేయాల‌న్న ఐడియాకు మొగ్గు చూపిన తెలుగు త‌మ్ముళ్లు.. గ‌డిచిన మూడు రోజులుగా త‌మ ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశారు. ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ఉన్న నేప‌థ్యంలో.. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా.. ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్టేలా ఉండే పోస్టుల్ని పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు.

కాస్త లాజిక్ గా ఉండేలా కొన్ని పోస్టుల్ని సిద్ధం చేసి.. తెగ వైర‌ల్ చేసేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే వాట్స‌ప్ ల‌లోని కొన్ని గ్రూపుల్లోనూ.. ఫేస్ బుక్ లోనూ కొన్ని పోస్టులు ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బాబు ఇమేజ్ మ‌రింత పెంచేలా.. ప‌వ‌న్ ప్లాన్ ఏమిటంటే అంటూ.. లాజిక్ మిస్ కాని రీతిలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ పెద్ద ఎత్తున పోస్టుల్ని వ‌దులుతున్నారు. కొన్ని పోస్టులు ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ట‌చ్ చేస్తూ..ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా పోస్టులు వైర‌ల్ కావ‌టం గ‌మ‌నార్హం.

ఇక్క‌డ ప్ర‌స్తావిస్తున్న వైర‌ల్ పోస్టుల‌తో తుపాకీకి ఏ మాత్రం సంబంధం లేదు. ప‌వ‌న్ పై టీడీపీ వీరాభిమానులు.. వారికి సంబంధించిన వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న వ్యాఖ్య‌లుగా మాత్ర‌మే చెప్ప‌క త‌ప్ప‌దు. వీటిల్లో కొన్ని మ‌రీ వ్య‌క్తిగ‌తంగా ఉంటే.. ఇంకొన్ని ఊహ‌కు అంద‌రి రీతిలో.. సాధ్య‌మ‌య్యే అవకాశం లేనివిగా ఉన్నాయి. మొత్తంగా ప‌వ‌న్ ఇమేజ్ ను ఎన్ని కోణాల్లో డ్యామేజ్ చేయాలో అన్ని కోణాల్లోనూ త‌ప్పు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తూ.. వండేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  గ‌డిచిన రెండు.. మూడు రోజుల్లో సోష‌ల్ మీడియాలో భారీగా స‌ర్కిలేట్ అవుతున్న వైర‌ల్ పోస్టుల్లో కొన్ని చూస్తే..

చంద్రబాబు అంటే భయం..ఎవరికి???

చంద్రబాబు అభివృద్ధి చెందితే ప్రధాని పదవికి పోటీ వస్తాడని మోదీకి భయం

ఆంధ్రా అభివృద్ధి చెందితే గుజరాత్ కు పోటీ వస్తుందని అమిత్ షా కి భయం

అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఖాళీ అవుతుందని కేసీఆర్ కు భయం

పోలవరం పూర్తయితే తన ఉనికి కే ప్రమాదమని జగన్ కి  భయం

విశాఖ కు రైల్వే జోన్ వస్తే తమ ఆదాయం పోతుందని ఒడిస్సాకు భయం

ఆంధ్రా పారిశ్రామికం గా వృద్ది చెందితే పెట్టుబడులు రావని తమిళనాడుకు భయం

ఆంధ్రా ఐ టి రంగం లో వృద్ది చెందితే తమకు పోటీ వస్తుందని కర్నాటకకు భయం

తెలుగుదేశం పాతుకుపోతే మళ్ళీ తనకు ఛాన్స్ రాదేమోనని పవన్ కు భయం

చంద్రబాబు ద్వారా తృతీయ ఫ్రంట్ ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటని రాహుల్ గాంధీకి భయం

భయం. భయం.. భయం… చంద్రబాబంటే అందరికీ భయమే

కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ ఒక భయముందీ…

అది 2019లో చంద్రబాబు రాకుంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందేమోనని… అరాచకపుశక్తులు విజృంభిస్తాయేమోనని...
------
------
మొత్తానికి పవనాలు ఏంచేప్పాడో విన్నారుగా అసలింతకీ ఇంత కంఠశోష దేనికంటే ....
మనోడు ఇన్నాళ్లు బాబుగారి అతిమంచి తనాన్ని బాగా వాడాడు మన భోళాశంకరుడు వీడి పిచ్చిని రాష్ట్రం కోసం భరించారు ....

ఈ మధ్య రాష్ట్రంలో కాలీ అయిన రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి అన్నకు ఇంకోటి pvp కి అడిగాడు మరి మావాల్లకు అంటే మూడోదానికి పోటి పెట్టండి కావలసిన ఏంఎల్యేలను పీవీపీ సర్దుతాడు అన్నాడు .....
బాబుగారు కుదరదు అని కరాఖండిగా చెప్పడంతో వాడి విషాన్ని ఇలా వెల్లగక్కాడు
------------
------------
ఇసుక వ్యవహారంలో వనజాక్షి ఇష్యూ జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది. ఆనాడే ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడి లోకేష్ బాబుకి ముడిపెట్టడం ఏంటి? నీ ఆంతర్యం ఏంటి?
------------
------------
పవన్ కళ్యాణ్ గారు
మీ కుటుంబం ఉండటానికి మీకు రెండున్నర ఎకరాలు కావాలి
మరి రాజధాని కి 30 వేల ఎకరాలు అవసరం ఉండదా
ముగ్గురు ఉండటానికి 2.5 ఎకరాలు
30 లక్షలు మందికి  30 వేల ఎకరాలు  ఉండ కూడదా
------------
------------
బాబు పవన్ కల్యాణ్ గారు #వనజాక్షి  కి అన్యాయం జరిగింది అంటున్నారు ఒక ఆడపిల్ల కి అన్యాయం జరిగితే నే ఇంత బాధపడుతున్నరూ
మరి మీరు ముగ్గురు ఆడపిల్లలకి అన్యాయం చేసారు గా నిన్ను ఎం అనాలి....... కొంచం చెపితే తెలుసుకుంటాం
------------
------------
రాబోయే రోజుల్లో జరగబోతున్న భాజపా-జనసేన కుట్ర తాలూకు నిజానిజాలు....

1. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని 18 అంశాలలో ఒకొక్కటి అడుగుతాడు.

2. ఒకదాని తర్వాత ఒకటి నెలకు ఒక అంశం మీద కొద్దీ కొద్దిగా కేంద్రం విదిలిస్తుంది నిధులు.

 3. నువ్వు అధికారంలో ఉండి అవినీతి చేసావు అందుకే కేంద్రానికి నీ మీద నమ్మకం లేక ఇవ్వలేదు. నేను నిజాయితిపరుణ్ణి కాబట్టి పోరాడి తెచ్చాను అని చంద్రబాబుమీద పవన్ కళ్యాణ్ చేత విషం చిమ్మిస్తుంది కేంద్రం.

4. నేను చెప్పింది అదేకదా. మన ఇద్దరి దారులు గమ్యాలు ఒకటే అని జగన్ పవన్ కళ్యాణ్ తో కలుస్తాడు.

5. చంద్రబాబు ఏమి చెయ్యలేదు కానీ అధికారం లేకున్నా పవన్ చాలా సాధించాడు అని బి.జె.పి. కలరింగ్ ఇచ్చి మద్దతు అడుగుతుంది

6. పవన్ ప్రత్యేకహోదా ఇస్తేనే మీతో పొత్తు పెట్టుకుంటే అని ఒప్పందం చేసుకొని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాడు.

7. తప్పని పరిస్థితుల్లో జైట్లీ వచ్చి పవన్ కు నిమ్మరసం తాగించి ప్రత్యేక హోదా ఇస్తున్నాం అంటాడు.

 8. దీనికి ముందే జగన్ పవనికి మద్దతు ప్రకటిస్తాడు.

 9. ప్రత్యేక హోదా తో పాటు అన్ని విభజన హామీలు సాధించిన హీరోల్లాగా జగన్ పవన్ లను చూపిస్తూ వారితో బి.జె.పి పొత్తు పెట్టుకుంటుంది. ఒకవేళ టి.డి.పి దగ్గరలో మెజార్టీకి ఆగిపోతే ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. (ఇది జరగదులే చంద్రబాబు ఉండగా)

10. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే జగన్ ను సీఓ కూర్చోబెడతారు.

11. ఈ.డీ - సి.బి.ఐ. కేసులు తిరగదోడి జగన్ కి శిక్ష పడేలా చేసి పడవినుంది తప్పించి పవను కూర్చోబెడతారు.

 12.అపుడు పవన్ జనసేనను బి.జె.పి.లో విలీనం చేస్తాడు.

 13.అపుడు బి.జె.పి.వై.ఎస్.ఆర్ పార్టీని కాప్చర్ చేస్తుంది. దిక్కులేని పరిస్థితుల్లో క్యాడర్ బి.జె.పి. వైపు వెళ్లకున్నా, ఎం.ఎల్.ఏ లు జంప్ చేస్తారు.

 14. ఈ లోపల చంద్రబాబు గారిని ఏదొక కేసులో ఇరికించి ఆయనని మానసికంగా బలహీనుడ్ని చేస్తారు.

ఇదీ అసలు ప్లాన్.  మన నాయకుడ్ని కాపాడుకోలేమా.... ఈ విషనాగుల నుంచి, ధృతరాష్ట్ర కౌగిలిలోనుంచి......
------------
------------

ఏపీ పై కుట్రలో నాలుగు దశలు.    
        
భారతీయ జనతాపార్టీ, పవన్ కల్యాణ్ మధ్య ఏర్పడిన రహస్య ఒపపందంలోని కీలక వివరాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసన మండలి సాక్షిగా కొన్ని వివరాలు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఉద్యమిస్తే హోదా ఇస్తామని బీజేపీ నేతలు చేసిన హామీలను బయటపెట్టారు. అసెంబ్లీలో చంద్రబాబు కొంత వరకే చెప్పారు.. కానీ అంతకు మించిన కుట్రలు ఇంకా ున్నాయని… తాజాగా వెల్లవుడోంది. దీని ప్రకారం… జనసేన అధినేత పవన్ కల్యాణ్… మే లో … ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా నిర్దారించారు. ఇప్పుడెందుకు ప్రారంభించరు అంటే.. ఇప్పుడు పిల్లల పరీక్షలున్నాయని చెప్పుకొచ్చారు. మేలో ఉండవా అంటే మాత్రం సౌండ్ లేదు.. కానీ బీజేపీ ప్లాన్ ప్రకారం … పొట్టి శ్రీరాములను హైలెట్ చేస్తూ… ఆ స్థాయి ఇమేజ్ వచ్చేలా వపన్ కల్యాణ్ హోదా ఉద్యమం ..అమరావతిలో చేస్తారు. దీని ప్రభావం తీవ్రంగా ఉండేలా … వైసెస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి. బీజేపీ వర్కవుట్ చేస్తుంది.

పవన్ కల్యాణ్ దీక్ష.. పీక్స్ కు చేరిందనగానే… తెలంగాణ ఉద్యమం తరహాలో.. ఏపీలో అల్లకల్లోకలం సృష్టించనున్నారు. ముఖ్యంగా అమరావతిలో చాలా తీవ్రమైన అల్లర్లు జరిగేలా చూస్తారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కేంద్రం నుంచి దూతలు రావడం.. పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు జరపడం.. ఆయన మొండికేయండ.. ఇలా వరుసగా జరుగుతాయి. చివరికి పవన్ కల్యాణ్ దీక్ష కు తాము మెచ్చి… ప్రత్యేకహోదా ఇస్తున్నట్లుగా ప్రకటిస్తారు. ఈ ప్ర్కరియ అంతా జూలైలో జరుగుతుంది. దీంతో పవన్ కల్యాణ్ ను.. పోరాటయోధుని.. ఆధునిక కాలంలో మరో పొట్టి శ్రీరాములుగా అభివర్ణించడానికి… బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఈ స్క్రన్ ప్లే ప్రకారం జరిగితే… ఆగస్టులో పవన్ కల్యాణ్.. మోదీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆయన కాళ్లకు నమస్కరించి.. దేశానికి గొప్ప నాయకుడని పొగుడుతారు. తాను బీజేపీతో కలిసి ఏపీలో పోటీ చేసి.. అధికారాన్ని అందుకోనున్నట్లు ప్రకటిస్తారు. దీంతో పొలిటికల్ డ్రామా కంప్లీట్ అవుతుంది.

ఒకప్పుడు… ప్రభుత్వాన్ని మార్చడానికి .. హైదరాబాద్ లో మతకల్లోలాలు రేపేవారు. అమరావతిలో ఆ చాన్స్ లేదు కాబట్టి డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రయోనజాల కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ఫడుతున్న బీజేపీ… ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలంలోకి నెట్టడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. దీనికి పవన్… మూలబిందువుగా మారడమే అసలు కోరణం… హోదా ఉద్యమంలో తన ఫ్యాన్స్ ను పవన్ బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా రోజుల్నించి ఆరోపణలు వస్తున్నాయి. అమరవీరులుగా తన అభఇమానులకే హోదా ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించి కార్యాచరణ త్వరలోనే ప్రారంభం కానుంది. కానీ బీజేపీ కానీ.. పవన్ కల్యాణ్ కు కానీ తెలియనిదేమిటంటే.. ఏపీ ప్రజలు ..మీరు అనుకున్నంత తెలివి తక్కువ వాళ్లు కాదు… అల్లర్లు రేపాలని చూస్తే.. హైదరాబాద్ వరకూ తరిమికొడతారు.. !
Tags:    

Similar News