దేవినేని ఉమాకు ఉన్నంత ధైర్యం.. అనిల్ కుమార్ యాద‌వ్‌కు లేదా?

Update: 2022-04-20 02:30 GMT
ఔను.. నెల్లూరు ప్ర‌జ‌లే కాదు.. రాష్ట్రంలోని మేధావులు కూడా ఇదే మాట అడుగుతున్నారు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఉన్నంత ధైర్యం.. ప్ర‌స్తుతం మాజీ అయిన‌.. ఇరిగేష‌న్ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కు లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి కార‌ణం.. స‌బ్జెక్ట్‌!  ఔను! ఏ మంత్రి అయినా.. త‌ను చూసిన , త‌ను వ్య‌వ‌హ‌రించిన శాఖ‌పై ప‌ట్టు పెంచుకుంటారు. ఆ శాఖ‌పై నిద్ర‌లో లేపి అడిగినా.. ఏం జ‌రుగుతోందో చెప్పే ప‌రిస్థితి ఉంటుంది.

అందుకే.. గ‌తంలో మంత్రుల‌ను ఎంచుకునేప్పుడు కూడా వారు ఏం చ‌దువుకున్నారు? గ‌తంలో ఏం చేశా రు? అనే అంశాల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకుని.. మంత్రి ప‌ద‌వులు ఇచ్చేవారు. అయితే.. రాను రాను.. రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్ల ప్ర‌స్థానం పెరిగిపోయిన నేప‌థ్యంలో స‌బ్జెక్ట్‌పై ప‌ట్టుకన్నా.. ప్ర‌తిప‌క్షంపై విరుచుకుప‌డే నాయ‌కుల‌కే ప్రాధాన్యం ద‌క్కుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. స‌రే... తాజాగా మాజీ అయిన‌..అనిల్‌.. సుమారు 3 సంవ‌త్స‌రాల పాటు.. మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. అది కూడా కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల మంత్రిగా ఉన్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఈ శాఖ‌పై ప‌ట్టు పెంచుకుని ఉండాలి. ముఖ్యంగాపోల‌వ‌రం.. వెలిగొండ‌, సీమ ఎత్తి పోత‌ల ప‌థకంవంటివాటిపై ఆయ‌న‌కు స్ప‌ష్టమైన క్లారిటీ ఉండి ఉండాల‌ని.. ఉంటుంద‌ని అంద‌రూ అను కున్నారు. ఇటీవ‌ల‌.. మాజీ అయిన త‌ర్వాత‌.. నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కొంద‌రు మిత్రులు.. ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప‌రిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించ‌గా.. నో.. మినిస్టీరియ‌ల్ ఇష్యూస్‌! అని దాట వేశారు అనిల్‌. అంటే.. ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేద‌ని.. అనుకోవాలో.. లేక త‌న‌నుమంత్రివ‌ర్గం నుంచి తొల‌గించిన కోపంతో అలా అన్నారో.. లేక మ‌రో కార‌ణమో తెలియ‌దు కానీ.. అనిల్ మాత్రం నోరు విప్ప‌లేదు.

ఇక‌, గ‌తంలో టీడీపీ హ‌యాంలో ఇదే శాఖ‌ను చూసిన‌.. మాజీ మంత్రి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు..మాత్రం శాఖ‌పై ప‌ప‌ట్టు పెంచుకున్నారు. ఆయ‌న మాజీ అయినా.. మూడేళ్ల పాటు ఇరిగేష‌న్ శాఖ‌కు దూరంగా ఉన్నా.. పోల‌వ‌రం స‌హా.. ప‌ట్టిసీమ‌, వెలిగొండ‌.. ఇలా ఏ ప్రాజ‌క్టు గురించి ప్ర‌శ్నించినా.. ట‌క‌ట‌క చెప్పేస్తుంటారు. అంతేకాదు.. ఏదైనా సంద‌ర్భం వ‌చ్చి.. అధికార పార్టీ చేసిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి వ‌స్తే.. టీడీపీ వెంట‌నే దేవినేని ఉమాను రంగంలోకి దింపుతున్న ప‌రిస్థితి ఉంది. కానీ, 2019 నుంచి ఈ శాఖ‌ను చూస్తున్న‌..అనిల్ మాత్రం దీనిపై ప‌ట్టు పెంచుకోలేక పోయార‌నే వాద‌న ఉంది.

ముఖ్యంగా నెల్లూరులో మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్‌ర‌డ్డికి ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ.. వ్య‌వ‌సాయం చాలా కీల‌క‌మ‌ని.. వ్యాఖ్యానించారు. అదేస‌మయంలో గ‌త మూడేళ్లుగా.. సాగు నీటి ప్రాజ‌క్టులు.. స‌రిగా ముందుకు సాగ‌లేద‌ని.. ఇప్ప‌టి నుంచి అయినా.. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని... రైతులు బాగుండాల‌ని.. వ్యా ఖ్యానించారు. అంటే... దీనిని ప‌రోక్షంగా అనిల్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన‌ కామెంట్లుగానే చూస్తున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News