బీఏసీ మీటింగ్ పై టీడీపీ నిరసన.. గవర్నర్ వద్దకు..

Update: 2020-01-27 07:06 GMT
సభ కార్యకలాపాలను ఇష్టమొచ్చినట్టు జగన్ సర్కారు నిర్వహిస్తోందని.. బీఏసీలో చర్చింకుండానే సొంతంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని టీడీపీఎల్పీ నేతలు ధ్వజమెత్తారు. సమావేశాలను మరికొంత కాలం పొడిగించాలని తాము కోరినా ఒక్కరోజే నిర్వహించాలని తీర్మానించారని మండిపడ్డారు. తమ డిమాండ్ ను పట్టించుకోలేదని బీఏసీ సమావేశం అనంతరం టీడీపీ నాయకులు నిరసన తెలిపారు.

అత్యంత కీలకమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లు సహా పలు అంశాలు సెలెక్ట్ కమిటీ ఆధీనం లో ఉన్నాయని.. వాటిని జగన్ సర్కారు స్తంభింపచేస్తోందని.. దానివల్ల అభివృద్ధి కుంటు పడుతుందని టీడీపీ శాసనసభా పక్షం మండిపడింది. బీఏసీలో అధికార వైసీపీ ఏకపక్ష ధోరణిని అవలంభిస్తోందని ఆరోపించింది. అసెంబ్లీ సమావేశాలను పొడిగించేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ను కోరారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు సహా మరో ఇద్దరు ఈ లేఖపై సంతకాలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఏక పక్షంగా.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, బిల్లులను చర్చించడానికి అవకాశం కల్పించని వైసీపీ విధానాలకు నిరసనగా సోమవారం శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ తెలిపింది. ప్రజాక్షేత్రంలోనే వైసీపీ పై తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
Tags:    

Similar News