సీఎం 'మేనమామ' పై టీడీపీ దుష్ప్రచారం !
ఏలూరులో ప్రస్తుతం ఓ వింత వ్యాధి స్థానికులని భయంతో వణికిపోయేలా చేస్తుంది. క్షణాల వ్యవధిలోనే దగ్గు, ఆయాసం వచ్చి కిందపడిపోయారు. ఇప్పటికే భాదితుల సంఖ్య 400 దాటింది. సీఎం జగన్ ఏలూరుకి వెళ్లి, బాధితుల్ని పరామర్శించి, వారికీ దైర్యం చెప్పి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకోని టీడీపీ పొలిటికల్ విభాగం కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి దుష్ప్రచారానికి ఒడిగట్టింది. సోషల్ మీడియా లో .. కల్తీ క్లోరిన్ నీటిలో కలవడం వల్లే ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని, నీటి శుద్ధికి కావాల్సిన రసాయనాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సరఫరా చేస్తున్నారంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి తప్పుడు ప్రచారానికి తెర లేపింది.
దీనిపై ఎమ్మెల్యే సీరియస్ గా స్పందిస్తూ టీడీపీ నాయకులు ఇలా దిగజారి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. తాను అలాంటి వ్యాపారమేదీ చేయలేదని, క్లోరిన్ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేనమామ అయినందునే టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామే తప్ప, ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలేదని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు.