వైసీపీలోకి జంపింగ్ లోనూ టీడీపీ ఎమ్మెల్యేల పోరే..

Update: 2020-03-17 14:30 GMT
ఏపీ మొత్తం వైసీపీ గాలి వీచినా ఆ ఒక్క జిల్లాలో మాత్రం టీడీపీ ఉనికి చాటింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలిద్దరూ ఇప్పుడు వైసీపీలో చేరడానికి దోబూచులాడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం తో అధికారానికి దూరంగా ఉండలేక.. టీడీపీలో ఇమడలేక వీరు వైసీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట..

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతిచ్చారు..ఇక మరో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలోకి ఫిరాయించేందుకు చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో అంతరాయం ఏర్పడిందట.. ఎందుకు? ఏమిటా కథ తెలుసుకుందాం.

ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీల చుట్టూ, పొగాకు, పత్తి వ్యాపారమే లక్ష్యంగా నేతలు బాగా సంపాదించుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలదే ఇక్కడ రాజ్యం. మిగతా వారిని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ టీడీపీకి పెద్దదిక్కుగా సీనియర్ కరణం బలరాం ఉన్నారు. తాజాగా ఆయన టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించారు.

ఇక ప్రకాశం జిల్లా మార్టూర్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైతం వైసీపీలోకి చేరుదామని చూసినా కరణం బలరాం అంటే అస్సలు పడని ఆయన బలరాం చేరిక తో ఆగిపోయారు. వీరిద్దరికి వివాదాలు తారాస్తాయి లో ఉన్నాయట.. అద్దంకి స్థానం కోసం టీడీపీలో వీరిద్దరి మధ్య పెద్ద ఫైటే నడిచింది. చంద్రబాబు సమక్షంలోనూ వీరిద్దరూ గొడవపడ్డారు.

అయితే బాబు 2019 ఎన్నికల్లో కరణం బలరాంను చీరాలకు పంపి అక్కడ గెలిపించారు. దీంతో గొట్టిపాటి, కరణం వర్గాలు శాంతించాయి. ఇప్పుడు వైసీపీలోకి కరణం చేరికతో గొట్టిపాటి వైసీపీలో చేరిక డ్రాప్ అయిపోయింది. వీరిద్దరి వర్గపోరు తో ఒకే పార్టీలో శత్రువుతో కలిసి ఉండకూడదని నిర్నయించుకొని గొట్టిపాటి వెనక్కి తగ్గాడట.. మరి మున్ముందు ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి మరీ.
Tags:    

Similar News