టీడీపీ జనసేన ప్లస్ కామ్రేడ్స్...మోడీ దూరంగానే...?
ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే. ఈ విషయంలో మిగిలిన విషయాలు కూడా తొందరగానే క్లియర్ అయ్యే చాన్స్ ఉంది. ఆ దిశగా పవన్ జనసైనికులను దారిలోకి తెచ్చే పనిలో ఉన్నారు. వారిని పొత్తుల దిశగా నడిపిస్తున్నారు. దానికి దారి తీసే పరిస్థితులను కూడా గట్టిగా చెబుతున్నారు.
దాంతో జనసైనికులు దాదాపుగా ఈ పొత్తుకు ఓకే అనే సీన్ ఉంది. మరో వైపు తెలుగుదేశంలో తమ్ముళ్ళు ఎప్పటి నుంచో పొత్తులకు సిద్ధ పడిపోయారు. తమకు అధికారం ముఖ్యం. జనసేనతో కలిస్తే అది దక్కుతుంది అనుకుంటే రెడీ అన్నదే తమ్ముళ్ల భావన. దాంతో ఈ రెండు పార్టీలకు ప్రధానంగా ఉన్న హర్డిల్స్ తొలగిపోయినట్లే అంటున్నారు. మరి ఈ కూటమిలోకి రావాల్సిన మిగిలిన పార్టీలేంటి అన్నదే చర్చ.
బీజేపీని ఈ కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. ఆ పార్టీకి ప్లేస్ అలా ఖాళీ పెట్టి ఉంచారు. దానికి ఒక టైం ఉంది. ఒక విధానం ఉంది. ఈ ఏడాది చివరిలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. అప్పటికి బీజేపీ తెలుగుదేశం పొత్తు ఆ రాష్ట్రంలో కుదిరితే దాన్ని ఏపీకి కూడా విస్తరించడం ద్వారా టోటల్ గా 2014 పొత్తులను రిపీట్ చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.
అయితే ఈ మూడు పార్టీలు కలిస్తే ఏపీలో 2014 రిజల్ట్ రిపీట్ అవుతుందా అంటే డౌటే అంటున్నారు. దానికి కారణం బీజేపీ మీద ఏపీ జనాలకు ఉన్న కోపం అంటున్నారు. ఇపుడు చూస్తే చంద్రబాబు విపక్షంలో ఉన్నారు. ఆయన మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉండే చాన్స్ లేదు. వచ్చే దంతా అనుకూల ఓటింగే. అలాగే కొత్త పార్టీగా పవన్ ఉన్నారు. సో ఆయనకు ఓట్లు రావాల్సినవే తప్ప పోయేది లేదు.
మరి బీజేపీ తీరు అలా కాదు, ఏపీకి గత రెండు విడతల పాలనలో ఏమీ చేయకుండా ఉందని జనాలు భావిస్తున్నారు. ఏపీ అడ్డగోలు విభజనకు బీజేపీకి ఒక కారకురాలిగా భావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పైగా స్టీల్ ప్లాంట్ వంటి వాటి విషయంలోనూ బీజేపీ అమ్మకానికి పెడుతూ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతోందని జనాలకు బాధ ఉంది. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ సెగ తెలుగుదేశానికి జనసేనకు కూడా తగులుతుందని. దాని వల్ల ఈ కూటమి అధికారంలోకి రాలేదని అంటున్నారు.
అదే బీజేపీ ప్లేస్ లోకి కామ్రేడ్స్ ని తీసుకుని వస్తే కనుక కచ్చితంగా ఏపీలో అధికారం ఈ కూటమికి దక్కుతుందని చెబుతున్నారు. దానికి కారణం కూటమిలోని అన్ని పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద దూకుడుగా విమర్శలు చేయవచ్చు. ఏపీకి ఏమి చేశారని నిలదీయవచ్చు. జనాలకు కూడా ఆ రకమైన నిలదీత బాగా నచ్చుతుంది. అదే విధంగా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే మేము మద్దతు ఇచ్చి ఏపీకి కొత్త రూపు షేపూ తీసుకుని వస్తామని చెప్పవచ్చు.
దాని మీద జనాలు నమ్మే చాన్స్ ఉంటుంది. అంతే తప్ప బీజేపీని వెంటబెట్టుకుని వస్తే మాత్రం ఏపీ జనాలు మరోసారి కూటమికి దూరం పెడతారు అని అంటున్నారు. ఇక ఏపీలో బీజేపీని దూరం పెట్టి రాజకీయం చేయాలని మనసులో ఉన్నా 2019 నాటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలుగుదేశం అధినాయకత్వం తలపోస్తోంది. ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సాయం కనుక ఉంటే కచ్చితంగా అది తమకు అనుకూలంగా ఉంటుందని, జగన్ని ధీటుగా ఎదుర్కోవచ్చు అని చంద్రబాబు ఊహిస్తున్నారు.
అలా కాకుండా అందరూ విపక్షంలో ఉన్న వారితో కూటమి కడితే ఇటు జగన్ అటు మోడీ ఈ ఇద్దరి పవర్ ని చవి చూడాల్సి వస్తుందన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ లేని కూటమి అంటే ఈ రోజుకు కూడా అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కానీ ఊహించలేకపోతున్నారు అని అంటున్నారు.
అయితే సీపీఐ రామకృష్ణ మాత్రం బీజేపీ లేని కూటమి అయితే తాము తప్పకుండా చేరుతామని అపుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సీపీఎం ది కూడా దాదాపుగా అదే మాటగా ఉంది. కామ్రేడ్స్ ఈ కూటమిలో చేరాలనుకుంటున్నారు. బీజేపీ దాగుడుమూతలు ఆడుతోంది. అయినా బాబు పవన్ మాత్రం వెయిట్ చేస్తున్నారు అని అంటున్నారు. జనాలు చూస్తే బీజేపీ మీద గుస్సా అవుతున్న వేళ కూటమిని సరైన పార్టీలతో కట్టకపోతే రిజల్ట్స్ అనుకున్న విధంగా రావు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.