టీడీపీ ప‌రువు ట్విట్ట‌ర్ సాక్షిగా పాయే..ఇలా అయితే ఫ్యూచ‌రేంటి..!

Update: 2019-07-15 09:30 GMT
నేటి స‌మ‌కాలీన స‌మాజంపై సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎంటి ? అని ప్ర‌శ్న‌స్తే చెప్ప‌డానికి చాలా క‌ష్టం. అనూహ్య‌మైన రీతిలో నేడు సోష‌ల్ మీడియా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తోంది. క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే కొన్ని ల‌క్ష‌ల మంది సోష‌ల్ మీడియా స‌మాచారానికి ప్ర‌భావితుల‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏది జ‌రిగినా.. సంచ‌ల‌నంగా మారుతోంది. అందుకే నేటి సాంకేతిక ప్ర‌పంచంలో బ‌ల‌మైన మాధ్య‌మం ఏదైనా ఉంటే అది సోష‌ల్ మీడియానే. అలాంటి సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయ నేత‌ల ప్ర‌మేయం - వ్యాఖ్య‌లు - కౌంట‌ర్లు కూడా అంతే రేంజ్‌ లో ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడుకోవాల్సిన మాట‌లు - న‌లుగురి మ‌ధ్య అన‌కూడ‌ని మాట‌లు కూడా సోష‌ల్ వేదిక‌ల‌కు ఎక్కుతుంటే.. పార్టీల ప‌రువు - నాయ‌కుల ప్ర‌తిష్ట‌లు కూడా నీట క‌లుస్తున్నాయ‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్‌ ల‌కు చెందిన నాయ‌కులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని రాజ‌కీయాల‌కు వాడుకున్నారు. అది కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను విమ‌ర్శించేందుకు - ఎత్తి పొడుపులు పొడుచుకునేందుకు వాడుకున్నారు. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థుల త‌ప్పుల‌ను ఎత్తి చూపుకొనేందుకు సోష‌ల్ మీడియాను ప్ర‌ధాన వేదిక‌గా చేసుకున్నారు. రూపాయి ఖ‌ర్చులేకుండా త‌మ మ‌నోభావాల‌ను - విమ‌ర్శ‌ల‌ను నెట్టింట్లో ఉంచి ల‌క్ష‌ల మందిని ఆక‌ర్షించారు. ఈ త‌ర‌హా సంస్కృతి ఏపీలోనూ ఏడాది కాలంగా బాగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు - టీడీపీపై చేస్తున్న విమ‌ర్శ‌లు దాదాపుగా ట్విట్ట‌ర్‌ - ఫేస్‌ బుక్ వేదిక‌లుగానే ఉంటున్నాయి. నిజానికి ఒక పార్టీ నేత‌లు.. మ‌రో పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేశారంటే కొంత వ‌ర‌కు అర్థం చేసుకోవ‌చ్చు. వీటిని విని లేదా అనందించ‌వ‌చ్చు.

కానీ, రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీలో దీనికి భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఈ పార్టీలోని నాయ‌కులు అంద‌రూ అని కాక‌పోయినా.. విజ‌య‌వాడ నుంచి విజ‌యం సాధించిన ఎంపీ కేశినేని శ్రీ‌నివాస్‌.. ఉర‌ఫ్ నాని.. త‌న సోష‌ల్ మీడియాను ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై కంటే.. సొంత పార్టీ నాయ‌కుల‌పైనే ఎక్కువ‌గా ప్ర‌యోగిస్తుండ‌డం వింత‌గా మారింది. చీటికీ - మాటికీ ఆయ‌న సొంత టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌ల బాణాలు వ‌దులుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే ఏకంగా టీడీపీ అధినేతపైనే ఆయ‌న విమ‌ర్శ‌లు సంధించారు. పోరాడితే.. పోయేదేం లేదు.. అంటూ.. ప్రారంభించి.. త‌న‌కు ప‌ద‌వుల‌తో ప‌నిలేద‌ని - త‌న‌కంటే సీనియ‌ర్ల‌కే ప‌ద‌వులు ఇచ్చుకోవ‌చ్చ‌ని - ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించి వివాదానికి తోక‌దీశారు.

ఇక, ఆ త‌ర్వాత‌ త‌న‌కంటే సీనియ‌ర్ నాయ‌కుడు - మాజీ మంత్రి - మైల‌వరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని ఉమాను ఉద్దేశించే ట్వీట్ల బాగోతానికి తెర‌దీశారు. వైసీపీ నేత కొడాలి నానీకి మంత్రి ప‌ద‌వి రావ‌డానికి దేవినేని ఉమా కార‌ణ‌మంటూ.. నాని ఎవ‌రికైనా కృత జ్ఞ‌త‌లు చెప్పాల్సి వ‌స్తే.. ముందుగా దేవినేనికే చెప్పాలంటూ కొత్త వివాదానికి కాలుదువ్వారు. ఈ ప‌రిణామంలో టీడీపీలో ఏదో జ‌రుగుతోంద‌నే వ్యాఖ‌లు, ముఖ్యంగా చంద్ర‌బాబు క‌ట్టుబాటు నుంచి త‌మ్ముళ్లు గాడి త‌ప్పుతున్నార‌నే ప్ర‌చారం - చ‌ర్చ కూడా జ‌రిగాయి. పార్టీ ప‌రువు తీస్తున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా సీనియ‌ర్ల నుంచి వినిపించాయి.

ఇక‌, తాజాగా కేశినేని నాని.. సొంత పార్టీ టీడీపీకి చెందిన - విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ ఇంచార్జ్ బుద్దా వెంక‌న్న‌ను టార్గెట్ చేశారు. నాని ఇటీవ‌ల కాలంలో చేస్తున్న ట్విట్ట‌ర్ కామెంట్ల‌పై కొన్ని రోజుల కింద‌ట స్పందించిన బుద్దా.. ఇది పార్టీకి మంచిది కాద‌ని - అధినేత‌తో మాట్లాడి చ‌ర్య‌లు తీసుకునేలా చూస్తాన‌ని ఆఫ్ ది రికార్డుగా మీడియాతో అన్నారు. అయితే, ఈ విష‌యం తెలుసుకున్న నాని నాలుగు అక్ష‌రం ముక్క‌లు చ‌ద‌వ‌డం - రెండు వాక్యాలు కూడా రాయ‌డం చేత‌కాని వారు నాలుగు ప‌ద‌వులు పొందుతున్నారు దౌర్భాగ్యం! అంటూ వెంక‌న్న పేరు పెట్ట‌కుండానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీనికి వెంక‌న్న వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చారు. పార్టీని మోసం చేసే వారి క‌న్నా.. అధినేత కోసం ప్రాణాలిచ్చే నాయ‌కుడే మేల‌ని పేర్కొన్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరుకుంది. తాజాగా మ‌రోసారి త‌న ట్విట్ట‌ర్‌ లో స్పందించిన కేశినేని.. ``రాజ‌కీయ జ‌న్మ‌లు - రాజ‌కీయ పున‌ర్జ‌న్మ‌లు - రాజ‌కీయ భ‌విష్య‌త్తులు గుళ్లో కొబ్బ‌రి చిప్ప‌ల‌దొంగ‌కీ - సైకిల్ బెల్లుల దొంగ‌ల‌కి - కాల్ మ‌నీగాళ్ల‌కి - సెక్స్ రాకెట్ గాళ్ల‌కి - బ్రోక‌ర్ల‌కి - పైర‌వీ దారుల‌కి అవ‌స‌రం -  నాకు అవ‌స‌రం లేదు`` అని నాని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

అక్క‌డితో ఆగ‌ని నాని మీ పెంపుడు కుక్క‌ల‌ను అదుపులో పెట్టుకోక‌పోతే తాను త‌న ఎంపీ ప‌ద‌వితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తాన‌ని నేరుగా చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో అల‌జ‌డి ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే పార్టీ ఓట‌మి భారంతో - అధికార పార్టీ వైసీపీ నుంచి ఎదుర‌వుతున్న ఎదురుదాడితో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. సొంత పార్టీ నేత‌లే పార్టీ ప‌రువును ట్విట్ట‌ర్‌కు ఈడుస్తారా? అంటే.. పార్టీ అభిమానులు తీవ్ర‌స్థాయిలో మండి ప‌డుతున్నారు. మ‌రో రెండు మాసాల్లో స్థానిక ఎన్నిక‌ల‌కు పెట్టుకుని, పార్టీని తామే నిలువునా నాశ‌నం చేస్తారా ? అంటూ.. నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎలా ? రియాక్ట్ అవుతారో చూడాలి.

   

Tags:    

Similar News