అమరావతిలో పొలిటికల్ ప్యూరిటీ పోటీలు

Update: 2017-01-21 10:00 GMT
ఏపీ రాజధాని ప్రాంతం వైసీపీ - టీడీపీ మధ్య పోటాపోటీ కార్యక్రమాలకు వేదికవుతోంది.  ఇటీవల అమరావతి ప్రాంతంలో జగన్ పర్యటించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు - కార్యకర్తలు శుద్ధి ర్యాలీ నిర్వహించారు. సచివాలయానికి ఏడు కిలోమీటర్ల వరకు ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేశారు. ఆవు మూత్రం చల్లుతూ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం వరకు వెళ్లారు.
    
అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ టీడీపీ ర్యాలీని మాత్రం అడ్డుకునే ధైర్యం చేయలేదు పోలీసులు. పచ్చ జెండాలను చూస్తూ, నేతలకు సలామ్ కొడుతూ ఉండిపోయారు. పై స్థాయి నుంచి ఒత్తిళ్ల కారణంగానే తామేమీ చేయలేకపోతున్నామని పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
    
మరోవైపు  వైసీపీ కూడా శుద్ధి కార్యక్రమాలకు తెరతీసింది.  సచివాలయం నుంచి కరకట్ట భవనం వైపు చంద్రబాబు వెళ్లే దారిలో శుద్ధి కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.చంద్రబాబు వచ్చాక రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందంటూ ర్యాలీ నిర్వహించబోయారు. అయితే టీడీపీ ర్యాలీని అడ్డుకోని పోలీసులు వైసీపీ ర్యాలీని మాత్రం  అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారని పోలీసులు ప్రశ్నించారు. మరి టీడీపీ ర్యాలీని ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను వైసీపీ నేతలు ప్రశ్నించగా వారు మౌనం దాల్చుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News