క‌రెన్సీ కంటే ప‌వ‌న్ క‌ల‌క‌ల‌మే ఎక్కువుంది

Update: 2016-11-14 11:30 GMT
దేశవ్యాప్తంగా కరెన్సీ కలకలం సృష్టిస్తోంటే రాష్ట్రంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలకలం రేపుతున్నాడని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. తాను ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పిన‌ ఇప్పుడు పోటీ చేస్తానని ప్రకటించటంతో ఇప్పటిదాకా మిత్ర‌పక్షం అనుకుంటున్న తెలుగుదేశానికి చెమటలు పట్టేపరిస్దితి వస్తుందంటున్నారు. అదే క్ర‌మంలో ప‌వ‌న్ రాజ‌కీయ స‌త్తా గురించి - ప్ర‌తిప‌క్ష వైసీపీకి త‌లెత్తే ఇబ్బంది గురించి జోరుగా చ‌ర్చించుకుంటున్నారు.

గత ఎన్నికలలో తెలుగుదేశం పవన్‌ కల్యాణ్‌ ను ఎన్నికల ఆయుధంగా మలుచుకొని సునాయాసంగా గెలిచింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పవనం వల్లనే తెలుగుదేశానికి గెలుపు ఇచ్చిందని అనేక వ్యాఖ్యలు వినిపించాయి. తాజాగా అనంత‌పురంలో పవన్‌ కల్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ మిత్ర‌పక్షం నుంచి శ‌త్రుపక్షంగా మారే ప‌రిస్థితి క‌నిపిస్తోందంటున్నారు. పవన్‌ కల్యాణ్ త‌న‌ సొంత సామాజిక‌వ‌ర్గంలోనే కాకుండా ఎస్‌ సి - ఎస్‌ టి - మైనార్టీలలోనే కాక అన్నివర్గాలలో మంచి పట్టుంది. రాష్ట్ర వ్యాప్తంగా బిసీలలోని ఎక్కువ కులాల్లో సైతం ప‌వ‌న్ ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. రాయలసీమలో బలిజలు - తెలగలు - ఒంటరి - కాపులు ఇలా అన్నికులాలు పవన్‌ ఆరా తీస్తుంటారు. దళితులు, మైనార్టీలు పవన్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. వాస్తవంగా వైకాపాకు దళితులు - మైనార్టీలు అండగా ఉన్నారు. ఇప్పుడు పవన్ బ‌రిలో దిగితే వైకాపాకు గండిపడే ప్రమాదం లేకపోలేదు. అయితే అంత‌కంటే ఎక్కువ‌గా తెలుగుదేశానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.

ఇప్పటికే తెలుగు దేశంకి చెందిన కొంత మంది కాపు ఎమ్మెల్యేలు పవన్‌ తో రహస్య మంతనాలు జరుపుతున్నారనే టాక్ ఉంది. పవన్‌ కల్యాణ్‌ కూడా రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాలపై దృష్టిపెట్టి నియోజకవర్గాలకు ఇన్‌ చార్జ్‌ లను కూడా పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎదుటివారిని విమర్శించటానికి - హవాభావాలకు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే నేపేథ్యంలో ఇప్పటికే ఏలూరులో నివాసం ఏర్పాటు చేసుకొని రాజకీయ కార్యాకలా పాలను కొనసాగించేందుకు ప‌వ‌న్ రెడీ అయ్యారు. తెలుగుదేశం మాత్రం పవన్‌ కల్యాణ్‌ ను బుట్టలో వేసుకొని మిత్రపక్షంగా వాడుకోవటానికి చూస్తున్నద‌ని అంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం పవన్‌ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఆరంభ శూరత్వంగా చేసి చివరకు కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన విధంగానే పవన్‌ కూడా జనసేన పార్టీని హడావుడిగా ఏర్పాటుచేసి చివరకు ఏదొక జాతీయ పార్టీలో విలీనం చేస్తారా అనే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. ఎదుటివారిని అంచనావేసి ఎత్తుకు పైఎత్తు వేసే సత్తా కూడా ఉండాలి కానీ పవన్ ఇంకా ఆ సామ‌ర్థ్యాన్ని సాధించుకోలేద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గం - ఎస్సీ - ఎస్టీ - మైనార్టీ వర్గాల యువత పవన్‌ వైపు ఎక్కువగా ఉన్న నేప‌థ్యంలో ఈ బ‌లంతో పవన్ ఎవరి రాజకీయ పుట్టి ముంచుతారోనని అన్నిపార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News