ఆంధ్రా ఓట్: టీడీపీ-కాంగ్రెస్ / టీఆర్ ఎస్
అది 2014 సార్వత్రిక ఎన్నికల సమయం.. విభజిస్తే తెలంగాణలో అధికారం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ నమ్మకంతో ఉంది. కానీ కేసీఆర్ తిరుగుబావుటా ఎగురవేసి కాంగ్రెస్ ను ఓడించాడు. విభజనవాది కేసీఆర్ తెలంగాణ మొత్తంలో మెరుగైన సీట్లు సాధించినా హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం తేలిపోయారు. మొత్తం 24 అసెంబ్లీ సీట్లలో కేవలం మూడంటే మూడు సీట్లే సాధించాడు. అదే సమయంలో టీడీపీ-బీజేపీలు కలిసి 14 సీట్లు గెలుచుకున్నాయి.
అప్పటి విభజనవాది కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రా అనుకూల వాది అయ్యారు. మంత్రి కేటీఆర్ జీహెచ్ ఎంసీ ఎన్నికల వేళ ఆంధ్రా ప్రజలు - ప్రముఖులు - నాయకులతో సమావేశాలు పెట్టి వారి మనసులు చూరగొన్నారు. జీహెచ్ ఎంసీలో టీఆర్ ఎస్ పతాకాన్ని ఎగురవేశారు.
2014 ఎన్నికల్లో ఏపీ - తెలంగాణ విడిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని తెలిసి హైదరాబాద్ లో ఉన్న అశేష ఆంధ్రా మూలాలున్న ప్రజలు టీఆర్ ఎస్ కు ఓటు వేయలేదు. కానీ గడిచిన నాలుగేళ్లుగా టీఆర్ ఎస్ తన పంథా మార్చుకొని ఇప్పుడు హైదరాబాద్ లోని సెటిలర్స్ మనసు దోచేసింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కల 15 సీట్లకు పైగా గెలిచేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం పలువురి ఆంధ్రా మూలాలున్న వారికి సీట్లు ఇచ్చేందుకు కూడా టీఆర్ఎస్ రెడీ అయ్యింది.
కాగా టీఆర్ ఎస్ ను ఎదుర్కొనేందుకు బద్ధశత్రువులు ఏకమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది. ఇదే జరిగితే ఆంధ్రా ప్రజలు ఎక్కువున్న ప్రాంతాల్లో టీడీపీకి సీట్లు ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ నేతల వద్ద టీడీపీ నేతలు ప్రస్తావించారట.. పూర్తి గా ఆంధ్రా వారికే సీట్లు ఇవ్వాలని కోరుతారట.. ఇలా కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ఇంతకుమించిన ప్లాన్ లేదని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రా ప్రజల మొగ్గు టీఆర్ ఎస్ వైపు ఉంటుందా.? లేక టీడీపీ-కాంగ్రెస్ అలయెన్స్ ను సపోర్టు చేస్తారా అన్నది అంతుచిక్కని గా ప్రశ్నగా ఉంది.. వచ్చే ఎన్నికల వరకూ కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.