‘ది తంగైల్​ ఎయిర్ ​డ్రాప్’ బంగ్లాదేశ్​ విముక్తి పోరాటంలో దీనిదే కీలకపాత్ర

Update: 2020-12-14 23:30 GMT
పాకిస్థాన్​ సైన్యాన్ని ముచ్చెమటలు పట్టించిన ఎయిర్​డ్రాప్​ ‘ది తంగైల్​ ఎయిర్​డ్రాప్​’దినీ దెబ్బకు పాకిస్థాన్​ సైన్యం తోకముడిచింది. పాక్​ జనరల్​ ఏఏకే నియాజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ ఎయిర్​డ్రాఫ్​ దెబ్బకు పాకిస్థాన్​ రెండు ముక్కలైంది. ఆ దేశం చెరలో ఉన్న బంగ్లాదేశ్​కు విముక్తి లభించింది. ఈ ఘటన చోటుచేసుకొని ఈ నెల 11కు సరిగ్గా 49 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటన పూర్వాపరాలు ఓ సారి తెలుసుకొందాం.. మహ్మద్​ అలీ జిన్నా పోరాటం లేదా కుట్రతో ఇండియా నుంచి పాకిస్థాన్​ విడిపోయింది. అప్పడు తూర్పు పాకిస్థాన్​ .. పశ్చిమ పాకిస్థాన్​లు ఏర్పడ్డాయి. పశ్చిమ పాకిస్థాన్​ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్​. అయితే పశ్చిమ పాకిస్థాన్​ (బంగ్లాదేశ్​)పై తూర్పు పాకిస్థాన్​ ఆధిపత్యం ఉండేది. దీంతో వాళ్లు పాకిస్థాన్​నుంచి విడిపోవాలని భావించారు.

మరో వైపు 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్థాన్​ కు చెందిన అవామీ లీగ్​ అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. అప్పటి పాలకుడు జుల్ఫీకర్​ అలీ భుట్లో పగ్గాలు వదులుకోవడానికి ఇష్ట పడలేదు. మరోవైపు తూర్పు పాకిస్థాన్​ లోని అవామీలీగ్​ ను అణచివేయడానికి సైనిక జనరల్​ ను పురమాయించారు.  మార్చి 26న బంగ్లాదేశ్​ నాయకులు, సైనికాధికారులతో కలిసి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. దీన్ని అణచి వేయడానికి పాక్​ సైన్యాన్ని పంపింది. దీనికి జనరల్​ ఏఏకే నియాజీ నాయకత్వం వహించారు. వీరు లక్షల మందిని హత్యచేశారు. దీంతో అవామీ లీగ్​ నాయకులు, కొందరు సైనికాధికారులు భారత్​ను ఆశ్రయించారు. భారత్​ అండదండలు అందించింది. దీన్ని కంటగింపుగా భావించిన పాక్​ డిసెంబర్​ 3న భారత్​ పై యుద్ధం ప్రకటించింది. దీంతో భారత్​ కూడా ప్రత్యక్షం గా యుద్ధరం లో అడుగు పెట్టింది.  పశ్చిమ పాకిస్థాన్​ వైపు లాంగ్​వాల్​ వద్ద భారీ సైనిక ఘర్షణ జరిగింది.

మన నౌకాదళం కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. ఇక్కడ 24 గంటలపాటు పోరు జరిగింది. సుమారు 350 మంది పాకిస్థానీ సైనికులు చనిపోయారు. ఆ తర్వాత భారతదళాలు కొన్ని రోజుల్లోనే ఢాకాలో అడుగుపెట్టాయి. డిసెంబర్​ 16న పాక్​ లెఫ్టినెంట్​ జనరల్​ ఏఏకే నియాజీ లొంగిపోయారు. దీంతో పాక్​ ఓటమి ఖాయమైంది.తంగైల్​ ఎయిర్​డ్రాప్​లో 5000 వేల మంది వరకు పాల్గొన్నట్టు పాకిస్థాన్​ భావించింది. ఇక ముప్పేట దాడిని తట్టుకోలేక ఏఏకే నియాజీ ఒత్తిడికి లోనై భారత్​ దళాలకు లొంగిపోయాడు. వాస్తవానికి 700 మంది పారా కమాండోలు మాత్రమే తంగైల్​ ఎయిర్​డ్రాప్​ లో పాల్గొన్నారు.
Tags:    

Similar News