ఆధారాల‌తో వ‌స్తాం...ద‌మ్ముందా బాబు?

Update: 2018-12-15 14:30 GMT
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుటుంబంపై చేస్తున్ననిరాధార ఆరోపణలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. ప్రజా సంకల్పయాత్రలో  వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేక టీడీపీ నేతలు అవాకులు - చెవాకులు పేలుతున్నారని మండిప‌డ్డారు. జగన్‌ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ గురించి తెలియని మూర్ఖులు ఆయన కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్ పై ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలన్న తమ్మినేని.. ఇసుక మాఫియాపై నార్కో అనాలసిస్‌ కు టీడీపీ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు.

 ఆముదాలవలస బహిరంగ సభలో వైఎస్‌ జగన్ అసత్యాలు మాట్లాడారన్న ప్రభుత్వ విప్ కూన రవి వ్యాఖ్యలను తమ్మినేని ఖండించారు. 'మాపై చేస్తున్న ఆరోపణలపై ఈ నెల 22న ఆధారాలతో వస్తాం. ధర్మపోరాట దీక్షకు శ్రీకాకుళం వస్తున్న చంద్రబాబు మా సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధమా? ఇసుక మాఫియా - భూ కబ్జాలపై బహిరంగ విచారణకు బాబు సిద్ధమా?' అని తమ్మినేని ప్రశ్నించారు.  కూన రవికుమార్‌ కు ఉన్న 600 ఎకరాల సర్వే నంబర్లు ఇస్తే తాము కూడా తెలుసుకుంటామన్నారు. 'నువ్వేంటే.. నువ్వెక్కడ పుట్టావో మాకు తెలుసు' అంటూ కూన రవిపై ధ్వజమెత్తారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తున్నందునే కోర్టుకు జగన్‌ హాజరవుతున్నారని.. చంద్రబాబుకు దమ్ముంటే తనపై ఉన్న స్టేలను ఎత్తివేయించి కేసులను ఎదుర్కోవాలని తమ్మినేని సూచించారు. టీడీపీ నాయకుల ఒంట్లో ప్రవహిస్తున్నది మనిషి రక్తమా...జంతువు రక్తమో తమకు అర్ధం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

వెన్నెల వలసలో త్రిపుల్ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి.. పూల సాగుకు కోసం 99 ఎకరాలు కేటాయించడానికి ఎలా ప్రతిపాదన చేశార‌ని త‌మ్మినేని సూటిగా ప్ర‌శ్నించారు. `సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు మా నాయకుడిపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే. అందుకే న్యాయదేవత ముందు ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. దైర్యముంటే కూన రవి  అక్రమాలపై విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి బహిరంగ విచారణకు రావాలి. టీడీపీ నేతల ఆరోపణలపై చర్చించడానికి మేము సిద్దం`` అని స్ప‌ష్టం చేశారు
Tags:    

Similar News