తమిళ గడ్డపై మజ్లిస్ మ్యాజిక్ పనిచేస్తోందా?

Update: 2021-03-04 05:38 GMT
దేశమంతా పాగా వేయాలని చూస్తున్న ఎంఐఎం పార్టీ చూపు ఇప్పుడు తమిళనాడుపై పడింది. బీహార్ఎన్నికల్లోనూ ఈ పార్టీ సత్తా చాటడంతో ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ ఎన్నికలపై గురిపెట్టింది. ఇక్కడా సత్తా చాటాలని భావిస్తోంది.

బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుకు విముఖత చూపడంతో అక్కడ ఎంఐఎం ఒంటరిగానే పోటీచేస్తోంది. తమిళనాడులో డీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీ.. ఒక వేళ కుదరకపోతే అక్కడ కూడా ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడులో ముస్లిం జనాభా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 9 శాతం ముస్లిం జనాభాను పరిగణలోకి తీసుకుంటే కనీసం 25 స్థానాల్లో వారికి ప్రాతినిధ్యం ఉండాలని.. కానీ తమిళనాడులోని ముస్లిం పార్టీలు కేవలం 3 సీట్లతోనే సంతృప్తి చెందుతున్నాయని అన్నారు. పరోక్షంగా ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీని ఆయన ఎద్దేవా చేశారు.

తమిళనాడులో మార్చి 7న ఎంఐఎం అభ్యర్థులను ప్రకటిస్తుందని.. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమిళనాడులో ప్రచారం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం డీఎంకేతో చర్చలు జరుపుతున్నామని.. ఒకవేళ అవి సఫలం కాకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. అన్నాడీఎంకేతో పొత్తు ఆలోచనే లేదన్నారు. ఎంఐఎం అధికార ప్రతినిధి మసూద్ ఖాన్ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఇతర ముస్లిం పార్టీలు ఎంఐఎంను చూసి భయపడుతున్నాయని అన్నారు. ఓవైసీ లాంటి బలమైన నేత తమ పార్టీకి ఉండటమే అందుకు కారణమన్నారు.
 
తమిళనాడులో ఎంఐఎం ఒంటరిగా బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా.. తమిళనాడు ఎంఐఎం చీఫ్ వకీల్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము పోటీ చేయబోతున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News