కరోనాను లైట్ తీసుకుంటున్నారా? ఇది చదవటం మిస్ కావొద్దు
కరోనా గురించి కంగారుపడటం మానేశా. అయినా ఇంకెక్కడి కరోనా? దాని అంతు చూసేంత రోగనిరోధక శక్తి వచ్చేసిందన్న మాటలు ఎవరినోటి నుంచి వింటే అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే.. అందులో అసలు కంటే.. అబద్ధమే ఎక్కువ ఉందన్నది మరవొద్దు. గతంతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందన్నది వాస్తవం. అంతమాత్రాన.. అది పూర్తిగా పోయిందన్న భావన కూడా సరైనది కాదు. తెలంగాణలో గడిచిన రెండు..మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వార్తల్లో పెద్దగా కనిపించని ఉదంతాల్ని చూసినప్పుడు.. కరోనాను మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
కరోనా విషయంలో నిర్లప్తంగా వ్యవహరించినా.. నిర్లక్ష్యం చేసినా అందుకు తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలంలో చేగుర్తిలో పది రోజుల క్రితం ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. ఆయన అంత్యక్రియలకు.. కర్మకు ఆ ఊరితో పాటు.. పక్కనున్న ఊళ్ల వారు కూడా హాజరయ్యారు. గడిచిన రెండు రోజుల్లో (గురు.. శుక్రవారం) కొందరికి కరోనా లక్షణాలు కనిపించటంతో.. వెంటనే అక్కడో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి.. పరీక్షలు నిర్వహించారు.
షాకింగ్ నిజం ఏమంటే.. పరీక్షలు జరిపిన వారిలో 33 మందికి పాజిటివ్ కాగా.. వారిలో 32 మంది చేగుర్తి వాసులు కావటం గమానార్హం. మరొకరు.. పక్కనే ఉన్న దుర్మేడ్ గ్రామస్తులు. దీంతో.. ఆయా గ్రామాల వారు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ రాయదుర్గం గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో పది రోజుల క్రితం ప్రిన్సిపల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే కరోనా కన్ఫర్మ్ అయ్యింది. ఇటీవల ఆ స్కూల్ కు చెందిన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో.. 26 మందిని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యం చేసే క్రమంలో వారికి పరీక్షలు జరపగా.. అందులోని ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.
అంతేకాదు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం 275 మందికి పరీక్షలు జరపగా.. వారిలో తొమ్మిదో తరగతి విద్యార్థికి పాజిటివ్ గా తేలింది. ఇలా.. పలు ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇంకెక్కడి కరోనా అంటూ లైట్ తీసుకోకుండా.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీకేర్ ఫుల్.