నన్ను గెలిపిస్తే చంద్రమండలంపైకి తీసుకెళ్తా !
దేశంలో త్వరలోనే మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులందరూ కూడా విజయమే లక్ష్యంగా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారం అంటే సాధారణంగా హామీలు కురిపించడం రాజకీయ నాయకులకి అలవాటే. ఎన్నికల్లో గెలుపు , ఓటమిని పక్కన పెట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో హామీలు కురిపిస్తుంటారు. ఒకవేల ఆ ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన హామీల్లో కొందరు కొన్ని పూర్తి చేస్తారు. మరికొందరు వాటి గురించి పెద్దగా పాటించుకోరు. ఇక ఓటర్లు కూడా హామీలు చూసే ఓట్లు వేస్తుంటారు.
అయితే , రాజకీయ నాయకుల హామీలు మామూలుగానే ఉంటాయి. గెలిపిస్తే నీళ్లు , రుణాలు , ఆ పథకాలు , ఈ పథకాలు ఇవే. అయితే ఇలా అందరీలా హామీలిస్తే తన స్పెషాలిటీ ఏముంటుందని భావించాడో ఏమో గానీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఫోటీ చేస్తున్న ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి విచిత్రమైన హామీల వర్షం కురిపించాడు. దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ గా శరవణన్ బరిలోకి దిగాడు. అన్ని రాజకీయ పార్టీలు టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అతడు ఎన్నికల ప్రచారాన్ని భిన్నంగా నిర్వహిస్తున్నాడు. శరవణన్ హామీలు చూసి మధురై ప్రజలే కాదు యావత్ తమిళనాడు తో పాటుగా దేశంమొత్తం ఆశ్చర్యానికి గురవుతోంది. రాజకీయ నాయకుల హామీలు విచిత్రంగా వుంటాయి కానీ మరీ ఇంత విచిత్రమా అంటూ ఓటర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. తనను నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం పైకి బ్యాచ్ ల వారీగా తీసుకువెళ్తా అని హామీ ఇచ్చాడు. అలాగే , నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తానని , ఇళ్లల్లో ఆడవాళ్లు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ చేస్తా అంటూ విచిత్రమైన హామీలు కురిపిస్తున్నాడు. చూడాలి మరి ప్రజలు ఈయనగారి హామీలని ఏమేర విశ్వసిస్తారో ..