బాలుడిలో పోలియో లక్షణాలు.. భారత్‌లో పోలియో అంతం కాలేదా?
పోలియో మహమ్మారిని అంతం చేసేందుకు మనదేశం ఎంతో కృషి చేసింది. దేశంలో పోలియోను లేకుండా చేసేందుకు ఐదేళ్ల లోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ అందజేశారు. ముందు ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తూ వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ల నుంచి బిడ్డ పుట్టిన పుట్టిన వెంటనే పోలియో చుక్కలు వేయడం ప్రారంభించింది. వైద్య సిబ్బందితో ఎన్నో అవగాహన కార్యక్రమాలు, జనంలో చైతన్యం తెచ్చి పోలియో కట్టడానికి కృషి చేశారు. ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాలను కూడా వదలకుండా ప్రయత్నాలు సాధించడంతో పోలియో కేసులు పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మన దేశ ప్రభుత్వం భారత్ పూర్తిగా పోలియో రహిత దేశమని ప్రకటించుకుంది. దేశంలో కొన్నేళ్లుగా ఎక్కడా పోలియో కేసులు నమోదు కావడం లేదు.కాగా తాజాగా అక్కడక్కడా పోలియో లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తున్నది.
ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ బాలుడికి పోలియో లక్షణాలు కనిపించాయి. సదరు బాలుడు అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. అతడికి చికిత్స అందించిన వైద్యులు పోలియో లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా నమూనాలు సేకరించి ఐఐఎస్‌కు పంపించారు. ఫలితం రావడానికి పదిహేను రోజులు పడుతుంది. మనదేశంలో చాలా ఏళ్ల క్రితమే పోలియో అంతమైంది. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. అయితే, రెండేళ్ల క్రితం 13 కేసులను, గతేడాది 32 కేసులను పోలియోగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత కాదని తేలింది. తాజాగా ఆరేళ్ల బాలుడిలో ఆ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది.