మోడీ చెప్పినట్లు లైట్స్ ఆపితే పెను ప్రమాదమేనట..

Update: 2020-04-04 05:45 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. దేశంలో కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి మద్దతుగా.. అందరం ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈ ఆదివారం ప్రతీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలు పెట్టమని సూచించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారమూ సాగుతోంది.

ప్రధాని మోడీ చెప్పిన ఆశయం మంచిదైనా.. దీని వల్ల పెద్ద ఉపద్రవం ఉన్నదని విద్యుత్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ చెప్పినట్టు దేశం మొత్తం ఒకే సారి లైట్లు ఆఫ్ చేస్తే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందని విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా లైట్లు ఆపితే విద్యుత్ వ్యవస్థ కుప్పకూలుతుందని తాజాగా విద్యుత్ ఇంజినీర్లు ప్రధాని కార్యాలయానికి తెలిపినట్లు సమాచారం. విద్యుత్ వినియోగం ఒకేసారి పెరిగినా.. తగ్గినా గ్రిడ్ పనిచేయడం నిలిచిపోతుందని.. అందరూ లైట్స్ ఆఫ్ చేస్తే పెను ప్రమాదమని నివేదించినట్టు తెలిసింది.

ఈ మేరకు విద్యుత్ ఇంజినీర్ల సంఘాల మధ్య చర్చ జరిగిందని తెలిసింది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వేసి ఉంచాలని విద్యుత్ నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే విద్యుత్ వ్యవస్థనే కుప్పకూలి సిట్ రైట్ కావడానికి చాలా సమయం పడుతుందని హెచ్చరిస్తున్నారు. 
Tags:    

Similar News