హిల్లరీకి మన కేశినేని అమ్మాయి ప్రచారం
ప్రపంచాన్ని శాసించే పెద్దన్న రాజ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున ట్రంప్.. డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్లు ముఖాముఖి తలపడే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. నువ్వా.. నేనా అన్నట్లు సాగే ఈ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేపడతారు. అమెరికా వ్యాప్తంగా సాగే ఈ ప్రచారానికి సంబంధించి పక్కా వ్యూహ రచన ఇరు పార్టీల వారు చేపడతారు. ప్రతిష్ఠాత్మకంగా సాగే ఈ ఎన్నికల ప్రచారంలో ఒక తెలుగమ్మాయి పేరు తెరపైకి వచ్చింది.
ఆమె ఎవరో కాదు.. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతా చౌదరి. డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల్లో తుది అభ్యర్థిగా నిలిచే హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు చూసే కీలక బృందంలో శ్వేత చౌదరి ఒక సభ్యురాలిగా ఎంపికయ్యారు. తండ్రి లోకల్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటే.. కూతురు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ విషయాలు చూస్తుండటం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మన ఎంపీగారి అమ్మాయి ప్రచారం విజయవంతం కావాలని కోరుకుందాం.