సూర్యా.. ఆవేశపడొద్దు.. అవకాశం కోసం వేచిచూడు.. రవిశాస్త్రి స్వీట్​ వార్నింగ్​

Update: 2020-10-30 07:30 GMT
ఇటీవల ఆస్ట్రేలియా టూర్​కు భారతజట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ జట్టులో ముంబై ఇండియన్స్​ స్టార్​ బ్యాట్స్​మెన్​ సూర్యకుమార్​కు చోటు దక్కలేదు. దీంతో సూర్యకుమార్​తోపాటు క్రికెట్​ అభిమానులు కూడా రగిలిపోతున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా సూర్యకు మద్దతుగా నిలబడ్డారు. సెలక్షన్​ కమిటీ తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో బుధవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రెచ్చిపోయిన సూర్యకుమార్​ మెరుగైన ఆటతీరును కనబరిచాడు.

బెంగళూరు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ కీలక పాత్ర పోషించాడు. 74 పరుగులతో అతనాడిన కీలక ఇన్నింగ్స్ ముంబై జట్టుకు అత్యంత కీలకమైన సమయంలో విజయాన్ని అందించింది. దాంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలబెట్టుకోవడంతోపాటు రన్ రేటులోను మెరుగుదల సాధించింది. విజయం సాధించిన అనంతరం సూర్యకుమార్​ కొంచెం అతిగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వినిపించాయి. బీసీసీఐ సెలక్టర్లను ఉద్దేశించి అసభ్యంగా సైగలు చేశాడన్న విమర్శలు వచ్చాయి.

 ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్​ సెలెక్టర్​ రవిశాస్త్రి స్పందించారు. సూర్యకుమార్​కు ఓ స్వీట్​ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఆటలో రాణించినంత మాత్రాన అతిగా ప్రవర్తించొద్దని, జాతీయ జట్టులోకి వచ్చే దాకా ఓపికతో వుండడం మంచిది’ అంటూ ట్వీట్​ చేశాడు. ఈ ట్వీట్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.  అయితే ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్ పేరు ప్రస్తుతం దేశం మొత్తం మార్మోగిపోతోంది. ఐపీఎల్ 2020లో అదరగొడుతున్న సూర్యకుమార్‌కు టీమిండియాలో చోటు కల్పించకపోవడం పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
Tags:    

Similar News