వారాంతంలో గుండెపోటా తస్మాత్ జాగ్రత్త..ప్రాణాలు కోల్పోయే అవకాశం!

Update: 2020-10-26 23:30 GMT
ప్రస్తుతం మనం తీసుకునే ఆహారాన్ని కొన్నేళ్ల కిందట తీసుకుంటున్న ఆహారంతో పోల్చుకుంటే  పూర్తిగా మారిపోయాయి. పూర్తిగా పాశ్చాత్య ధోరణి అలవరుచుకున్నారు. ఆహారపు అలవాట్లే కాదు. ఉద్యోగాలు చేయడంలో కూడా మార్పులు వచ్చాయి. రాత్రిపూట కూడా జాబ్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. చాలా రంగాల్లో ఉద్యోగులు ఒత్తిడితో కూడిన పని చేస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడే వారి సంఖ్య అధికమైంది. ఒకప్పుడు గుండెపోటు అంటే ఏ 50 సంవత్సరాలకో  60 సంవత్సరాలకో  వచ్చేది కానీ మారిన ఆహారపు అలవాట్లు,  లైఫ్ స్టైల్ కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారు.

మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఏ సమయంలో గుండెపోటు వస్తే రిస్కు ఎక్కువుంటుంది అనేదానిపై  ఇటీవల వైద్య నిపుణులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వారాంతాల్లో గుండెపోటుకు గురైన వారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలవరకు హార్ట్ ఎటాక్ వచ్చిన వారి డేటాపై ఇటీవల యూకేకు చెందిన వైద్య నిపుణులు పరిశోధనలు చేశారు. వారి అధ్యయనంలో సంచలన అంశాలు వెలుగు చూశాయి.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ సమయంలో  గుండెపోటు వచ్చినా  బతికే అవకాశం  ఎక్కువగా ఉంటుందని, అదే వారాంతంలో  వస్తే మాత్రం బతికే ఛాన్స్ తక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కాకుండా శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం లోపు గుండెపోటు వచ్చిన వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే బతికే అవకాశం  ఉంటుందని ఇటీవల ఫిలడెల్ఫీయాలో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ స్కిన్స్ సింపోజియం సదస్సులో యూకే కు చెందిన వైద్య నిపుణులు ప్రకటించారు.  వారాంతాల్లో గుండెపోటు బారిన పడ్డవారు కాస్త అప్రమత్తంగా ఉంది వైద్యం చేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Tags:    

Similar News