‘హిందుత్వం’పై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఇప్పుడు దేశంలో హిందుత్వ ఎజెండా నడుస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ బలం బలగం.. హిందుత్వనే.. అందుకే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలాంటి హిందుత్వ అనుకూల నిర్ణయాలను బీజేపీ తీసుకొంది. దీనిపై మైనార్టీలు , దళితులు ఇతర ఈశాన్య రాష్ట్రాల వారు భగ్గుమన్నారు. ఢిల్లీలో హింసలో 38మందికి పైగా చనిపోయారు.
పోయిన ఎన్నికల్లోనూ బీజేపీ తరుఫున మోడీ, షాలు ఈ హిందుత్వ ఏజెండా, జాతీయవాదాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. అసలు హిందుత్వ తో ఓట్లు అడగడం తప్పు అని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో పలువురు సుప్రీం కోర్టుకు ఎక్కారు. దీనిపై తాజాగా సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
శబరిమలలో మహిళల ప్రవేశంపై తీర్పు చెప్పాక.. ‘హిందుత్వ’పై విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బొబ్డే తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 1991లో హిందుత్వ రాజ్యం తెస్తామని ఓట్లు అడిగిన మనోహర్ జోషితోపాటు బీజేపీ, శివసేనల ఎన్నికల చెల్లదంటూ నాడు బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యం లో ఇప్పుడు హిందుత్వ నినాదం తో ఓట్లను అడిగే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని రివ్యూ పిటీషన్లు సుప్రీం కోర్టులో వేశారు. దీనిపై వాదనలు వింటామని తాజాగా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
1992 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ హిందుత్వ పిటీషన్లపై విచారణకు సుధీర్ఘ సమయం పడుతుందని.. శబరిమల కేసు తర్వాత వాదనలు వింటామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు.