అబార్షన్ మహిళల హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Update: 2022-09-29 07:05 GMT
అబార్షన్.. పెళ్లి కాకుండానే తల్లి అయ్యి యువతులు గుట్టుచప్పుడు కాకుండా కడుపులోనే బిడ్డలను చిదిమేస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ కారణంగా గర్భం దాల్చే యువతులు, మహిళలకు ఇన్నాళ్లు అబార్షన్లపై బోలెడన్నీ ఆంక్షలుండేవి.

డాక్టర్లు బహిరంగంగా చేయడానికి భయపడేవారు. అవివాహితులైన యువతుల వద్ద నుంచి అయితే రహస్యంగా చేయడానికి లక్షలు తీసుకొని కానిచ్చేవారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు దీనిపై సంచలన తీర్పునిచ్చింది.

గర్భస్రావాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని చారిత్రక తీర్పునిచ్చింది.

ఇందులో వివాహితులు, పెళ్లికాని అవిహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందంటూ పేర్కొంది.

చట్టప్రకారం మహిళలందరికీ సురక్షిత అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి అయినా కాకున్నా గర్బాన్ని తొలగించే హక్కు వారికి ఉంటుందని తెలిపింది. గర్భం దాల్చిన 24 వారాల వరకూ అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది.

పెళ్లి అయిన వారిని 24 వారాలలోపు అబార్షన్ కు అనుమతిస్తూ.. అవివాహితులను అనుమతించకపోవడం సరికాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇప్పుడు కాలం మారిందని.. చట్టం స్థిరంగా ఉండకూడదని.. వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేిసంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News