కేసీఆర్ నిర్ణయం కుదరదని తేల్చిన సుప్రీం
తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా షాకిచ్చింది. తనకు అధికారం కట్టబెట్టిన సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట మేరకు.. వారికి వారసత్వ తాయిలాన్ని ఇచ్చిన వైనాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వారసత్వ ఉద్యోగాలపై కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేస్తూ తీర్పును ఇచ్చింది. ఈ ఉదంతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీం సమర్థించింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన సుప్రీం.. హైకోర్టు తీర్పు సరైనదని పేర్కొంది.
25 అసెంబ్లీ.. మూడు లోక్ సభా స్థానాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేసే సత్తా ఉన్నా సింగరేణి కార్మికులకు.. కుటుంబాలకు భారీ తాయిలాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. వారసత్వ ఉద్యోగ హక్కు పునరుద్ధరణకు తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకోసం 18 ఏళ్ల కిందటే వారసత్వ ఉద్యోగ హక్కును నిలిపివేసిన సింగరేణి యాజమాన్య నిర్ణయాన్ని నాలుగు నెలల కిందటనే పునరుద్దరించటం గమనార్హం. తాజాగా సుప్రీం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మళ్లీ యథాతథ స్థితి నెలకొనుంది.
సింగరేణి సంస్థ ఉద్యోగులు.. సిబ్బందిలో ఎవరైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే.. వారి తరఫున కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ఉద్దేశంగా చెప్పాలి. సాధారణ ఖాళీలకు ఈ విధానం వర్తించదు. సాధారణ ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇవన్నీ కారుణ్య నియమకాల కిందకే రానున్నాయి.
అయితే.. ఈ నిర్ణయం సరికాదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు.. కేసీఆర్ నిర్ణయాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై అప్పీలుకు వెళ్లినప్పటికీ.. సుప్రీంలోనూ తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయంగా తనకెంతో ప్రయోజనం కలిగించే ఈ నిర్ణయాన్ని అమలు చేయటానికి వీలుగా.. తాజా తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యాంగంలోని 14..16 నిబంధనలకు వారసత్వ ఉద్యోగాలు విరుద్ధమని పేర్కొన్నసుప్రీంకోర్టు.. గతంలో హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్లు తేల్చి చెప్పింది. వాస్తవానికి కేసీఆర్ తాజాగా ప్రకటించిన తాయిలం అప్పుడెప్పుడో 1981లోనే అమలు చేశారు. అయితే.. వీటిని 1998లో రద్దు చేశారు. గతంలో ఎలా అయితే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారో.. అలానే ఇవ్వాలంటూ అప్పటి నుంచి కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా కేసీఆర్ నిర్ణయం తీసుకోగా.. సుప్రీం ఆయనకు షాకిస్తూ.. విస్పష్ట ఆదేశాలు ఇవ్వటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/