ఆ విషయంలో మగాళ్లే ముందున్నారట!
దేశంలో రోజురోజుకూ ఆత్మహత్యలు చేసుకునే వారిసంఖ్య పెరుగుతోంది. నిరుద్యోగం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ప్రేమవ్యవహారం తదితర కారణాలతో యువత అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే నేషనల్ క్రైం రికార్డ్స్ తాజాగా వెల్లడించిన గణాంకాల్లో ఓ ఆసక్తి కరమైన అంశం వెలుగుచూసింది. అదేమిటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో అత్యధికంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే ఉంటున్నారట.
గత ఏడాది దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నవారి లెక్కలు తీస్తే అందులో అత్యధికంగా వీళ్లే ఉన్నారు. మరోవైపు 23.4 శాతం మంది రోజుకూలీలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం మరో బాధాకరమైన విషయం. 15.4 శాతం గృహిణులు, 11.6 శాతం మంది సొంతంగా ఉపాధిపొందేవారు. 10.1 శాతం మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు నేషన్ క్రైమ్ రికార్డ్స్ గణాంకాలు చెబుతున్నాయి.
ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో అత్యధిక శాతం పురుషులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబసమస్యల వల్ల 32.4 శాతం మంది, అనారోగ్య సమస్యలతో 17.1 శాతం మంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. పోయిన సంవత్సరం అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. ఆ రాష్ట్రంలో మొత్తం 13,493 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. రెండోస్థానంలో తమిళనాడు. ఆ తర్వాత స్థానాలను పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక దక్కించుకున్నాయి. కాగా తెలంగాణలో గత ఏడాది 7,675 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇందులో అత్యధికంగా రోజు కూలీలే ఉన్నారు. 2,858 మంది కూలీలు, 499 మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 6,465 మంది బలవన్మరణానికి పాల్పడగా అందులో యువకులే అత్యధికంగా ఉన్నారు. అన్ని సమస్యలకు చావే పరిష్కారం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఆత్మహత్యలు చేసుకోకుండా అవగాహన కల్పించాలని.. ప్రజలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.