చార్మినార్ కింద మెట్లు.. తాజాగా ఎలా బయటకు వచ్చాయి?

Update: 2022-02-16 04:49 GMT
హైదరాబాద్ మహానగరానికి ఐకానిక్ లాంటి చార్మినార్ కు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

తాజాగా ఈ మహా కట్టడానికి పిడుగుల కారణంగా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా పురాతత్వ సర్వేక్షణ విభాగానికి చెందిన అధికారులు కొన్నిరోజులుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు మినార్లకు ఇత్తడి వైర్లు ఏర్పాటు చేసి.. వాటిని భూమికి అనుసంధానం చేస్తున్నారు.

 అంతేకాదు.. జనరేటర్ ఏర్పాటుకు అవసరమైన గుంతను తవ్వుతున్నారు. ఇలా తవ్వుతున్న వేళ.. తాజాగా చార్మినాన్ మినార్ (స్తంభం) కు కాస్త దూరంలో భూమి లోపల కూరుకుపోయిన మెట్లు బయట పడ్డాయి. చార్మినార్ నుంచి గోల్కొండకు రహస్య మార్గం ఉందన్న మాట తరచూ వినిపించే నేపథ్యంలో.. చార్మినార్ వద్ద కూరుకుపోయిన మెట్లు ఆసక్తికరంగా మారాయి.

ఈ మెట్ల వ్యవహారం తెలిసినంతనే మజ్లిస్ కార్పొరేటర్ అక్కడకు చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అసలు చార్మినార్ వద్ద గుంతలు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

అయితే.. తాము ఏం చేస్తున్నామన్న విషయాన్ని మజ్లిస్ నేతలకు వివరించటంతో వారు సమాధానపడ్డారు. చార్మినార్ కింద మెట్లు బయటకు రావటం ఇప్పుడు ఆసక్తికరమైంది. మరి.. దీనికి సంబంధించిన తదుపరి ఏం చేయనున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News