భారతీయుడికి నోబెల శాంతి బహుమతి

Update: 2016-02-03 12:11 GMT
భారత్ దేశానికి ఈ ఏడాది గొప్ప బహుమతి వరించబోతోందా? ప్రపంచమంతా కీర్తించే నోబెల్ బహుమతి భారత్ వ్యక్తికి రానుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే... అది ఏ శాస్త్ర ఆవిష్కరణలకో... ఆర్తిక రంగంలోనో, సాహితీవేత్తలకో కాదు అత్యంత కీలకమైన నోబెల్ శాంతి బహుమతి రానుందని తెలుస్తోంది. ఆ ఘనతను అందుకునేదెవరో కాదు. వందలాది దేశాల్లో ఆధ్యాత్మిక, మోటివేషన్ సేవలందిస్తున్న జీవనకళాకేంద్రం వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కు ఆ గౌరవం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది. నోబెల్‌ శాంతి బహుమతి పొందనున్న వారి పేర్లను నార్వేరియన్‌ నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంకా ప్రకటించలేదు. అయితే.. రవి శంకర్ పేరు తుది పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది.

శ్రీశ్రీ రవిశంకర్‌ కొలంబియాలో శాంతి స్థాపన కోసం విశేష కృషి చేశారు. గత ఏడాది తన క్యూబా పర్యటన సందర్భంగా ఆయన రివల్యూషనరీ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఆఫ్‌ కొలంబియా నేతలతో పలుమార్లు చర్చలు జరిపారు. ఫలితంగా రాజకీయ లక్ష్యాల సాధనలో గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించడానికి వారు అంగీకరించారు. గత ఏడాది కొలంబియా ప్రభుత్వం శ్రీశ్రీ రవిశంకర్‌ ను తమ దేశంలోని అత్యున్నత పురస్కారం 'ఆర్డెన్‌ డి లా డెమోకేషియా సైమన్‌ బోలివర్‌'తో సత్కరించింది. భారత ప్రభుత్వం ఆయనకు ఈ ఏడాది పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. విప్లవకారులను గాంధేయవాదులుగా మార్చిన ఫలితానికి రవిశంకర్ కు నోబెల్ శాంతి బహుమతి వస్తే నిజంగా అది గర్వకారణమే.
Tags:    

Similar News