సీట్ల సర్దుబాటు కోసం పార్టీ నిరసన దీక్ష

Update: 2015-08-16 06:43 GMT
ఎన్నికల భారతంలో సిత్రాలకు కొదవలేదు. తాజాగా అలాంటి సిత్రమే బీహార్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని అడ్డుకోవటానికి బీహార్ రాష్ట్రంలో జేడీయూ.. ఆర్జేడీ..కాంగ్రెస్ లు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో సమాజ్ వాదీ పార్టీ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ కూడా భాగస్వామి అనుకున్నా.. సీట్ల సర్దుబాటులో ఈ పార్టీలు లేని పరిస్థితి.

మరోవైపు.. సీట్ల సర్దుబాటు విషయంలో తమను పట్టించుకోనందుకు నిరసనగా సమాజ్ వాదీ పార్టీ బీహార్ శాఖ అధ్యక్షులతో సహా పలువురు నేతలు నిరసన దీక్ష చేపట్టారు. బీహార్ లో మహా కూటమి ఏర్పడటానికి తమ అధినేత ములాయం సింగ్ యాదవ్ కారణమని.. అయినా.. తమ పార్టీకి సీట్లు ఇవ్వరా అంటూ మండిడుతున్నారు.

ఎన్నికల సమయంలో మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో వివాదాలు మామూలే. సీట్ల సర్దుబాటు సరిగా లేని సమయంలో అలగటం.. కూటమిలో నుంచి బయటకు వచ్చేసి.. సొంతంగా పోటీ చేయటం లాంటివి మామూలే. అందుకు భిన్నంగా.. సీట్ల సర్దుబాటు ప్రయత్నాల్ని వదిలిపెట్టేసి.. రోడ్డు మీదకు వచ్చి సీట్ల కోసం నిరసనలు చేపట్టటం ఏమిటో..? సత్తా ఉందనుకుంటే స్వతంత్రంగా పోటీ చేసి తామేంటో చూపించాలే కానీ.. ఈ నిరసన దీక్షలేమిటంటూ బీహారీలు బుగ్గలు నొక్కుకునే పరిస్థితి.
Tags:    

Similar News