మోడీ జలాస్త్రంతో పాక్ పని ఖేల్ ఖతం
భారత్ లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందా? సరిహద్దుల్లో చొరబాటు భారత్ పై యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలా ? భారత్ ను నేరుగా ఎదుర్కోలేక పాకిస్తాన్ దొంగచాటు దెబ్బకొట్టేందుకు రెడీ అవుతోందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు భారత్ నే కాదు..యావత్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. గత ఆదివారం జమ్మూకశ్మీర్ యూరీ సెక్టార్ లో పాక్ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. ఉరీ సెక్టార్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 18 మంది మన జవాన్లు.. వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్ని నివ్వెరపోయాయి. పాకిస్తాన్ కు తెరచాటుగా సపోర్ట్ చేసే అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ విషయంలో పాకిస్తాన్ పై కత్తులు నూరుతోంది. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయంగా పెద్ద డిఫెన్స్ లో పడిపోయింది.
నేరుగా భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే భారత్ ను కనీసం రెండు రోజులు కూడా భారత్ ను నిలువరించే సత్తా
పాకిస్తాన్ కు లేదు. అప్పుడప్పుడు ఇలా దొంగ దెబ్బలు తీస్తూ తాము గొప్ప అన్నట్టుగా వ్యవహరించడం తప్ప పాక్ చేయగలింగిందేమి లేదు. భారత్ తో నేరుగా పాక్ యుద్ధం చేయనూ లేదు...తోకముడచుకుని కూర్చోనూ లేదు.
పాక్ తాజా దాడుల నేపథ్యంలో ఆ దేశంపై యుద్ధం చేయాలన్న ఒత్తిళ్లు తీవ్రతరమవుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ యుద్ధం చేయాకుండానే పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మోడీ కేవలం జలాస్త్రం అనే బాణం ద్వారా పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.
ఈ జలాస్త్రం స్టోరీ ఏంటంటే భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ప్రవహిస్తోన్న సింధూ నదీ జలాల పంపిణీపై 56 సంవత్సరాల క్రితం రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 80 శాతం నీటిని వాడుకుంటోంది. ఈ ఒప్పందం ప్రకారం పంచనదుల్లో బియాస్ - రావి - సట్లేజ్ నదులపై భారత్ కు హక్కులున్నాయి. జమ్ము కాశ్మీర్ నుంచి ప్రవహించే సింధు - చినాబ్ - జీలం నదులపై పాకిస్థాన్ కు కంట్రోల్ ఉంటుంది.
ఈ ఒప్పందం రద్దు అయితే పాకిస్తాన్ కు నీరు వెళ్లదు...ఆ దేశం ఎడారిగా మారడం ఖాయం. అక్కడ కొన్ని లక్షల ఎకరాల్లో పంట పడించుకునేందుకు నీరు ఉండదు. పాకిస్తాన్ తెరవెనక ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ భారత్ ను దెబ్బకొడుతున్నన్ని రోజులూ ఈ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే ప్లాన్ లో మోడీ సర్కార్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఒక్క బుల్లెట్ పేలకుండానే..చిన్న రక్తం చుక్క కూడా చిందకుండానే పాకిస్తాన్ దారిలోకి రావడం ఖాయమన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.