షాకింగ్ న్యూస్.. కరోనా లక్షణం మరోటి వెలుగులోకి.. దద్దుర్లు ఉన్నా
మహమ్మారి కరోనా వైరస్ కొత్త పుంతలు తొక్కుతూ తన పంజా విసురుతూ మానవ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో ఆ వైరస్‌పై విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనాకు సంబంధించి మరో లక్షణం బహిర్గతమైంది. కరోనా వైరస్ లక్షణాలు అంటే జ్వరం - పొడి దగ్గు - అలసట - శ్లేష్మ దగ్గు - గొంతునొప్పి - తలనొప్పి - కండరాల నొప్పి - చలి - వికారం - ముక్కులో ఇబ్బంది - ముక్కు నుంచి నీరు కారడం - విరేచనాలు వంటివి అని చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. అదే చర్మంపై దద్దుర్లు. శరీరంపై దద్దుర్లు ఉన్నా కరోనా వైరస్ సోకినట్లేనని పలు పరిశోధనల్లో తేలింది.
కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నట్లు ఇటాలియన్ పరిశోధకులు గుర్తించారు. కరోనా బాధితులకు చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని ఇటాలియన్ వారు చేసిన అధ్యయనంలో తేలింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే మానవుడికి వచ్చే అన్ని రోగాల లక్షణాలు కరోనా వైరస్ కు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చర్మ సంబంధిత అంశాలు కూడా కరోనా వైరస్ సోకిన వారికి ఉండడం తో ప్రజలు ఆందోళన లో పడ్డారు.
ఇటలీలోని కరోనా బాధితుల్లో 20శాతం మందికి దద్దుర్లు ఉన్నాయి. ఫిన్‌లాండ్, స్పెయిన్, అమెరికా, కెనడాలో కూడా వైరస్ బాధితుల్లో ఎర్రటి పాచెస్, దురదలు ఉన్నట్లు గుర్తించారు. వారి పై కూడా అక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా సోకితే దద్దుర్లు వస్తాయని ఆ పరిశోధనల్లో తేలింది. ఎక్కువగా కాలిపై, బొటన వేలిపై, చేతుల పైన దద్దుర్లు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై మరికొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.
జ్వరం, దగ్గు, నొప్పులు ఉండ దద్దుర్లు ఉండి తప్పనిసరిగా కరోనా వైరస్ సోకిందని నిర్ధారణకు రావొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అవేవి లక్షణాలు లేకున్నా దద్దుర్లు ఉంటే వెంటనే వారు వైరల్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కోలా వ్యాపిస్తోంది. ఆ వ్యాపించిన వారికి కూడా లక్షణాలు ఒకరికొకరికి తేడాగా ఉన్నాయి. దీంతో ఎలాంటి లక్షణాలు ఉన్నా ముందు వైద్యులను సంప్రదించాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తోంది. అన్నిటి కన్నా ముఖ్యంగా శుభ్రంగా ఉంటే చాలు ఏ వైరస్ రాదని చెబుతున్నారు.