హైదరాబాద్ లో ఆరాచకం.. మెనూ కార్డు ఇవ్వకపోతే అంత విధ్వంసమా?
హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలోని వివరాలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. హైదరాబాద్ లో ఇలాంటి ఆరాచకాలు చోటు చేసుకోవటమా? అన్న సందేహం రాక మానదు. దాదాపు నాలుగు రోజుల క్రితం (సెప్టెంబరు 28న) చిక్కడపల్లికి సమీపంలో ఉండే రాంనగర్ వీఎస్టీ రోడ్డులోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు ముషీరాబాద్ కు చెందిన సుమన్.. చిన్నా అనే యవకులు వచ్చారు.
మెనూ కార్డు అడిగితే.. కోవిడ్ కారణంగా తీసేశామని చెప్పారు. హోటల్ నడిపేటప్పుడు మెనూ కార్డు ఇవ్వకుండా నడుపుతారా? అంటూ ప్రశ్నించాడు. ఇలా మొదలైన మాటలు చివరకు వాగ్వాదంగా మారింది. కుర్చీలు విసిరి.. నిర్వాహకుడ్ని బెదిరిస్తూ వెళ్లిపోయారు. తర్వాతి రోజు రాత్రి పది గంటల సమయంలో ముఖానికి మాస్కులు కట్టుకొని పది మంది యువకులు కర్రలు.. రాడ్లు పట్టుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి దూసుకొచ్చారు.
క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని కుమారుడు పర్వేశ్ రెడ్డి.. దీపక్ లను తీవ్రంగా గాయపర్చారు. అంతేకాదు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అద్దాలు పగలకొట్టటం.. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేయటంతో పాటు.. పెట్రోల్ సీసాల్ని తీసుకొచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారమంతా సీసీ కెమేరాల్లో నిక్షిప్తం కావటం.. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావటంతో విషయం సంచలనంగా మారింది.
మరీ.. ఇంత ఆరాచకమా? బిహార్.. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చూసే సీన్లు.. హైదరాబాద్ మహానగరంలో.. అందునా నగర నడిబొడ్డున చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఈ ఆరాచకానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంటనే వదిలేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దాడికి కారణమైన వారిపై కంప్లైంట్ చేసినా సీఐ శివశంకర్ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దీనిపై ఆయన వివరణ కోరిన మీడియా వారిపైనా.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మీరే విచారించండి.. మీరే పట్టుకోండన్న మాటను సీఐ అన్నట్లుగా చెబుతున్నారు. సిటీలో పెరుగుతున్న నేరాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే.. తనపై వస్తున్న ఆరోపణల్ని చిక్కడపల్లి సీఐ ఖండిస్తున్నారు. కేసు బుక్ చేశామని.. నిందితుల్ని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.