డబ్బు కోసం కట్టుకున్న భార్యని అమ్మోరికి బలిచ్చిన ఓ ప్రబుద్దుడు..ఆ తర్వాత ఏమైందంటే?

Update: 2020-10-26 12:30 GMT
ప్రపంచం ఆధునికంగా ఎంతోముందుకుపోతుంది. మనుషులు రాకెట్స్ వేసుకొని నింగికి వెళ్లి వస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి పోటీ ప్రపంచంలో కూడా కొందరు ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్ముతున్నారు. తాజాగా ఛత్తీస్‌ గఢ్‌ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా నవరాత్రుల్లో భార్యని అమ్మవారికి  బలి ఇచ్చాడు ఓ కిరాతకుడు. నరబలిని సమర్పించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే మూఢనమ్మకంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి , ఆ ముక్కలతో  అమ్మవారికి  పూజలు చేశాడు. దీన్ని పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతణ్ణి అరెస్టు చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌ గఢ్‌ సుర్గుజా జిల్లాలోని సర్గావ్‌లో మహార్నవమి రోజు ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. సబ్బల్ అనే వ్యక్తి  భార్యతో కలిసి సర్గావ్‌ లో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆటను తరచూ క్షుద్రపూజలు చేస్తుంటాడనే పేరుంది అతనికి. దెయ్యాలను వదిలించడం వంటి చర్యలను చేస్తుంటాడు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య వ్యవసాయ కూలీ.  సంపాదన కూడా అంతంతమాత్రమే, దీనితో  డబ్బు సంపాదించాలనే ఆశతో అమ్మోరికి నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఎనిమిది రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షను స్వీకరించి తొమ్మిదో రోజు నరబలి ఇస్తే, కోరిన కోరికలు తీరుతాయని బలంగా నమ్మాడు. ఎనిమిది రోజుల పాటు ఉపవాసం అనంతరం తొమ్మిదో రోజు మహార్నవమి నాడు ఇంట్లో అమ్మవారికి భార్యను బలి ఇచ్చాడు. అమ్మవారి పటం ముందు భార్యను పొడిచి చంపాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు.

ఆ ముక్కలతో అమ్మవారికి  పూజలు చేశాడు. 24 గంటల పాటు అతని భార్య కనిపించకపోవడం, అతని ఇంట్లో నుంచి మంత్రాలు వినిపించడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో వెంటనే వెంటనే పోలీసులు సబ్బల్ ఇంటికి వెళ్లారు. ఇంకిపోయిన రక్తపుమడుగులో, ముక్కలుగా కనిపించిన మృతదేహాన్ని చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. తమ విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. ఒక్కోసారి ఒక్కోరకంగా స్టేట్‌మెంట్ ఇస్తున్నాడని చెప్పారు. డబ్బు సంపాదించాలనే ఆశతో నరబలి ఇచ్చినట్లు ఒకసారి, అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసినట్లు మరోసారి చెబుతున్నాడని తెలిపారు.
Tags:    

Similar News