పీటర్ మరీ ఇంత ముదురా?
ఎవరూ తక్కువ తినలేదన్నట్లుగా ఉంది పీటర్ ముఖర్జి వ్యవహారం వింటే. ఒక ప్రఖ్యాత మీడియా సంస్థలో కీలక బాధ్యతలు పోషిస్తున్న పీటర్ ముఖర్జి గుర్తుకు రాలేదా? తల్లి చేతిలో హత్యకు గురైన షీనా బోరా గుర్తుకు వచ్చిందా? అవును.. ఆ ఇంద్రాణి భర్తే ఈ పీటర్. కూతుర్ని తల్లే చంపేసిందన్న విషయంపై అతగాడు అమాయక చక్రవర్తి మాదిరి మాటలు చెప్పినప్పటికీ.. అతడిలోని పలు కోణాలు తాజాగా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి
షీనా బోరా హత్య కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ హత్యకు కారణమైన ఇంద్రాణితో పాటు.. ఆమె భర్త పీటర్ గురించి ఆరా తీసిన నేపథ్యంలో విస్మయం చెందే వాస్తవాలు బయటకు వచ్చాయి. అయితే.. వాటిని ఇంతకాలం బయటకు రాకుండా అధికారులు సక్సెస్ అయినప్పటికీ తాజాగా మాత్రం ఈ వివరాల్ని లాయర్లకు అందజేయటంతో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. పీటర్ మాజీ భార్య షబ్నమ్ సింగ్ అతడి గురించి సంచలన విషయాలు చెప్పటంతో పీటర్ ఏమీ తక్కువేం తినలేదన్నట్లుగా అనిపించక మానదు.
తన మాజీ భర్త గురించి షబ్నమ్ చెప్పిన సంగతులు చూస్తే.. పీటర్ కు నైతిక విలువలు అన్నవి లేవని.. అతని చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలు ఉండాల్సిందేనని ఆమె పేర్కొంది. వయసులో ఉన్న అమ్మాయిలు తన చుట్టూ ఉండటనికి పీటర్ ఇష్టపడతాడని.. లేట్ నైట్ పార్టీలంటే అతనికి ఇష్టంగా చెప్పింది. ‘‘అతని జీవితంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అందుకే విడాకులు తీసుకున్నాను. ఇంగ్లండ్ లో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తానన్నాడు. తనతో ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. తన వెంట తీసుకొచ్చిన అమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. ఆమే.. ఇంద్రాణి. ఇలా చేయటంతో ఆగ్రహంతో.. నువ్వు బాగుపడవు అని అన్నా’’ అని తన సాక్ష్యంగా చెప్పటం గమనార్హం.
మరో కీలకవిషయం ఏమిటంటే..ఈ కేసుకు సంబంధం లేని ఒక సంచలన విషయాన్ని కూడా షబ్నమ్ చెప్పారని.. అది కానీ బయటకు వస్తే.. పీటర్ పరువు మొత్తం పోతుందని చెబుతున్నారు. పీటర్ కు సంబంధించి సంచలన విషయాలు వాంగూల్మంగా చెప్పిన నేపథ్యంలో అతడి మాజీ భార్య షబ్నమ్ కు మరింత భద్రత కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ.. పీటర్ కు సంబంధించి బయటకు రాని సంచలన విషయం ఏమిటో..?