షకిబుల్ హసన్ బతికిపోయాడు.. వివరణ ఇస్తే చాలన్న బీసీబీ
నిబంధనలు ఉల్లంఘించి వివాదాల్లో చిక్కుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకిబుల్ హసన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నుంచి భారీ ఊరట లభించింది. షకిబుల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. షోకాజ్ నోటీసు ఇచ్చామని.. దానికి హసన్ సమాధానం చెప్పాల్సిందేనని సీఈవో నిజాముద్దీన్ చౌదరి పేర్కొన్నారు. అక్టోబర్ 22న షకిబుల్ హసన్ బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ గ్రామీఫోన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించడమే. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని బీసీబీ భావించింది. అతడికి నోటీసులు కూడా జారీ చేసింది. 'రోబీ మా టైటిల్ స్పాన్సర్. గ్రామీఫోన్ టైటిల్ స్పాన్సర్‌కు బిడ్ దాఖలు చేయకుండా కొందరు క్రికెటర్లకు ఎక్కువ మొత్తం ఇచ్చి వారితో ఒప్పందం కుదుర్చుకుంటోంది. మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్‌ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్‌తో పాటు సదరు కంపెనీ నష్ట పరిహారం ఇవ్వాల్సిందే. లీగల్ నోటీసు పంపాం' అని ఇంతకుముందు నజ్ముల్ తెలిపారు.
నోటీసు పంపిన కొన్ని గంటల వ్యవధిలోనే బీసీబీ మనసు మార్చుకుని షకిబుల్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదని పేర్కొంది. 'ఇది బోర్డు అంతర్గత వ్యవహారం. ఇక్కడితేనే ముగింపు పలకాలని అనుకుంటున్నాం. షకిబుల్‌పై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాడు ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు అనే దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంది' అని చెప్పింది.
దేశవాళీ క్రికెటర్ల జీతాలు, ఇతర సౌకర్యాల మెరుగుదలకు షకీబుల్ హసన్ సారథ్యంలోని సీనియర్ ఆటగాళ్లు సమ్మె చేయడం, దాంతో దిగొచ్చిన బీసీబీ వారి 11 డిమాండ్లకు సమ్మతించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీలో జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో భారత్-బంగ్లాదేశ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభం కానున్నది.