ఏపీలో లోకల్ వార్ : సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ మరో లేఖ..సహకరించాలంటూ విజ్ఞప్తి !

Update: 2020-12-11 06:44 GMT
ఏపీ ఎన్నికల సంఘం, జగన్ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వివాదం ముదురుతోంది. రోజు రోజుకి ఈ వివాదం పెరిగిపోతుంది. ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ ఎన్నికల సంఘం , ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో కుదరదు అంటూ ప్రభుత్వం పట్టు విడవకపోవడం తో ఆ వివాదం అలాగే కొనసాగుతుంది. ఇదిలా ఉంటే , తాజాగా మరోసారి నిమ్మగడ్డ ఏపీ సీఎస్ కి లేఖ రాశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ , ఏపీ సీఎస్ నీలం సాహ్నికి  మరోసారి లేఖ రాశారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహరించాలని , రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని.. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహాయక సహకారాలు అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో  స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

ఈ మేరకు సీఎస్‌ తో పాటు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ కు ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. కోర్టు ఆదేశాలను ప్రస్తావించిన నిమ్మగడ్డ.. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఇక ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గత నెల 23వ తేదీన సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ రాసిన సంగతి సంగతి తెలిసిందే. అయితే , ఈ లేఖ పై రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా , ఏపీ సీఎస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News