గొంతులో కొత్త అవయవాన్ని గుర్తించిన డాక్టర్లు..

Update: 2020-10-22 06:15 GMT
మానవ శరీర నిర్మాణం, అవయవాల అమరికపై అనునిత్యం పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్యులు మనిషి గొంతుకలో ఓ కొత్త ఆర్గాన్​ను గుర్తించారు. ప్రొటెస్ట్​ కేన్సర్​ పరిశోధనలో చేస్తుండగా ఈ కొత్త అవయవం కనిపించదట. నెదర్లాండ్ కు చెందిన సైంటిస్టుల ఈ కొత్త అవయవాన్ని కనిపెట్టారు. ఈ కొత్త అవయవం గొంతు‌పై భాగాల్లో ఉండే లాలాజాల గ్రంథులతో తేమతో కూడిన ద్రవపదార్థాన్ని వినియోగిస్తుంటుందని తెలిపారు.
నెదర్లాండ్స్​కు చెందిన రేడియోథెరపీ అండ్​ అంకాలజీ జర్నల్​లో నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (ఎన్​సీఐ)తో సహా పరిశోధకుల బృందం ఈ పరిశోధనను ప్రచురించారు. మానవులలో గొంతులో ద్వైపాక్షిక సూక్ష్మ లాలాజల గ్రంథులు ఉంటాయని గతంలోనే పరిశోధన ద్వారా తేలింది. వీటిని ట్యుబరియల్ గ్రంథులుగా పిలుస్తారు. కొత్త అవయవంపై సుమారు 100  మందిపై సైంటిస్టులు పరిశోధనలు చేశారట.

వారందరిలోనూ ఈ ఆర్గాన్​ కనిపించింది.
పాజిట్రాన్ ఎమ్మిస్సన్​ టోమోగ్రఫీ (పీఈటీ) స్కాన్లు, సీటీ స్కాన్ల కాంబినేషన్ తో కూడిన పీఎస్​ఎంఏ, పీఈటీ​-సీటీ ద్వారా సైంటిస్టులు గొంతులోని ప్రొస్టేట్ కేన్సర్ కణాలను స్కానింగ్ చేస్తున్న సమయంలో ఈ కొత్త గ్రంథులు కనిపించాయి. ఈ టెక్నిక్ లో భాగంగా డాక్టర్లు పేషెంట్ లోకి రేడియో యాక్టివ్ ట్రేసర్ ఎక్కిస్తారు. ప్రొస్టేట్ కేన్సర్ కణాలను పీఎస్​ఏంఏ ప్రొటిన్ ద్వారా బయటకు తీస్తారు. ఈ కాంబినేషన్ స్కాన్లతో పీఎస్​ఏంలే లో లాలాజాల గ్రంథి కణజాలలను సులభంగా గుర్తించవచ్చు. కేన్సర్ చికిత్స కోసం డాక్టర్లు వినియోగించే రేడియో థెరపీ ద్వారా తల, మెడను ప్రధాన లాలాజల గ్రంథులకు దూరంగా ఉండేలా ప్రయత్నిస్తారు. లేదంటే ఆ కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా తినడం, మాట్లాడటం లేదా మింగాలంటే పేషెంట్లకు చాలా కష్టంగా మారుతుంది.

కానీ, కొత్తగా కనుగొన్న ఈ లాలాజల గ్రంథులపై ఇంకా రేడియేషన్ ప్రభావం పడుతూనే ఉందని రీసెర్చర్లు అంటున్నారు. దీని కారణంగా ఆయా పేషెంట్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో డాక్టర్లకు కూడా పెద్దగా అవగాహన లేదని చెబుతున్నారు. ఈ రేడియో థెరపీ తీసుకునే పేషెంట్లలో ఈ గ్రంథులను విడిచిపెట్టడం ద్వారా వారిలో నాణ్యమైన జీవితాన్ని మెరుగుపర్చే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. ఈ గ్రంథులను రేడియేషన్ నుండి ఎలా తప్పించాలో తెలుసు కోవాల్సిన అవసరం ఉందని అధ్యయన పరిశోధకులలో ఒకరైన ఎన్​సీఐకి చెందిన నిపుణులు చెప్పారు. పుర్రె భాగంలో గ్రంథులు ఉన్నందున వాటిని ఇప్పటివరకు గుర్తించలేకపోయామన్నారు.
Tags:    

Similar News