ఫ్లిప్ కార్ట్ సచిన్ బన్సాల్ తప్పించుకున్నాడట

Update: 2020-05-14 08:30 GMT
దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. వారి వెతలకు సంబంధించిన వార్తలు చాలావరకూ బయటకు రావటం లేదు. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రభావితమయ్యేలా చేసిన లాక్ డౌన్ నుంచి తానెలా తప్పించుకున్నానో చెప్పుకొచ్చారు ఈ కామర్స్ ప్రముఖుడు.. ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్.

ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ కానీ తన చిన్నతనంలో వచ్చి ఉంటే.. తాను పేదరికంలో పెరగాల్సి వచ్చేదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో తన తండ్రి చిన్న వ్యాపారాల్ని నిర్వహించేవారన్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ తో.. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల్ని కళ్లకు కట్టేలా చెప్పారని చెప్పాలి. తానో పెద్ద కష్టం నుంచి తప్పించుకున్న వైనాన్ని చెప్పారు.

తన ఉదాహరణతో.. పరిస్థితి తీవ్రత ఎంతన్నది చెప్పటమే కాదు.. నష్టపోయిన వారి భవిష్యత్తు ఎంతలా ప్రభావితం అవుతుందన్న విషయాన్ని సచిన్ బన్సాల్ చెప్పే ప్రయత్నం చేశారని చెప్పాలి. తన బాల్యంలో కానీ లాక్ డౌన్ వచ్చి ఉంటే.. తానుతప్పనిసరిగా మధ్యతరగతి స్థాయి నుంచి పేదరికంలో పెరగాల్సి వచ్చేదన్నారు. అదే జరిగి ఉంటే.. తానీ రోజున సాధించినవేమీ సాధించలేకపోయేవాడినని చెప్పారు. ఇవాల్టి రోజున లక్షలాది మంది పిల్లలకు జరుగుతున్న నష్టమిదే అంటూ గుండెను టచ్ చేసేలా ట్వీట్ చేశారు.
Tags:    

Similar News