దిమ్మ తిరిగే షాక్.. రష్యా దేశ ప్రధానికి కరోనా పాజిటివ్
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. కొన్ని దేశాల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపించలేదన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని దేశాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ పోస్టుల్లోనూ కరోనా వైరస్ చైనా మిత్ర దేశాల్లో పెద్దగా వ్యాప్తి చెందలేదన్న మాట తరచూ వినిపిస్తోంది. చైనాకు అత్యంత సన్నిహితంగా ఉండే రష్యాలో కరోనా ప్రభావం పెద్దగా లేదన్న వార్తలు అప్పుడప్పడు వస్తున్నాయి. అయితే.. ఇలాంటి ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని తేల్చేయటమే కాదు.. తాజాగా రష్యా దేశ ప్రధానికి కరోనా పాజిటివ్ అని తేలటం షాకింగ్ గా మారింది.
ఇప్పటికే యూరప్ దేశాలకు చుక్కలు చూపించిన కరోనా.. ఇప్పుడు రష్యాలోనూ తన సత్తా చాటుతుందంటున్నారు. బ్రిటన్ దేశాధ్యక్షుడు ఆ మధ్యన కరోనా బారిన పడటమే కాదు.. అత్యవసర సేవల కోసం ఆసుపత్రికి తరలించిన వైనం తెలిసిందే. తర్వాత ఆయన్ను డిశ్చార్జి చేశారు. తాజాగా రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్టిన్ కు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఆ దేశాధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ కు తెలిపారు. దేశాధ్యక్షుడితో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో తనకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ప్రధాని వెల్లడించారు.
ఇంట్లోనే ఆయన వైద్య సాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. రష్యాలో ఇప్పటివరకూ 1.06లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11,619 మంది కోలుకోగా.. 1073 మంది మరణించారు. ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న బాధితుల్లో 2300 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం రష్యా మీద తక్కువనే ప్రచారానికి భిన్నంగా ఆ దేశంలో పాజిటివ్ సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పక తప్పదు.