రూ.2.5కోట్ల కారులోనూ మంటలేనా?

Update: 2015-08-25 04:10 GMT
రోడ్డు మీద రయ్యిన దూసుకెళ్లే వాహనాలు ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగిపోవటం.. ఆ వెంటనే కారులో ఉన్న వారంతా బయటకు పరుగులు తీయటం అప్పుడప్పడు జరుగుతుంటాయి. దీనికి కారులోని సాంకేతిక అని కొందరు.. మరికొందరు అక్రమంగా వినియోగించే గ్యాస్ కిట్స్ కారణంగా అగ్గికి ఆహుతి అయ్యే పరిస్థితి.

తాజాగా రూ.2.5కోట్లు విలువైన కారులో ఎందుకు మంటలు వచ్చాయో తెలీదు కానీ.. విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక కారు సైతం మిగిలిన కొన్ని కార్ల మాదిరే మంటలు చెలరేగి.. కాలిపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.   

ఇటలీకి చెందిన ప్రముఖ వాహన సంస్థ అయిన లంబోర్గి  స్పోర్ట్స్ కారులో మంటలు రేగాయి. అయితే.. డ్రైవర్.. కారులో ఉన్న వారు అప్రమత్తంగా ఉండటంతో సురక్షితంగా బయటకు వచ్చారు. అన్నేసి కోట్ల విలువున్న కారు నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించటం.. బూడిద కుప్ప కావటం విస్మయం వ్యక్తమవుతోంది.  కారులో నుంచి మంటలు ఎందుకు వచ్చాయన్న అంశంపై కంపెనీ దృష్టి సారించిందని చెబుతున్నారు. కోట్లు పెట్టి కొన్న కారు.. కళ్ల ముందే క్షణాల్లో కాలి బూడిద కావటం బాధాకరమే.
Tags:    

Similar News