సుప్రీం మాటః రోజా...క్ష‌మాప‌ణ‌లు చెప్పండి

Update: 2016-04-21 11:20 GMT
వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో కీల‌క మ‌లుపు. త‌న స‌స్పెన్ష‌న్‌ ను ఎత్తివేయాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన రోజాకు స‌ర్వోన్న‌త న్యాయస్థానం త‌గు సూచ‌న చేసింది. స‌స్పెన్ష‌న్ విష‌యంలో ఏపీ అసెంబ్లీదే తుది నిర్ణయమని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు రోజాకు సూచించింది.

తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ రోజా సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు సభలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రోజాకు సూచించింది. ఆమె క్షమాపణలను సభ పరిగణనలోనికి తీసుకోవాలని పేర్కొంది. ఒక వేళ రోజా క్షమాపణ చెప్పకుంటే ఏం చేయాలన్నది కోర్టు నిర్ణయిస్తుందని పేర్కొంది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.
Tags:    

Similar News