సీఎంగా జగన్ ఎవర్ గ్రీన్..రోజా హాట్ కామెంట్స్
రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలని.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి శక్తిని బలాన్ని.. విజయాలను ప్రసాదించాలని మల్లికార్జునస్వామి వారిని కోరుకున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి ఎవర్ గ్రీన్ సీఎంగా జగన్ ఉండాలని.. భవిష్యత్ అంతా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి పేరిట టీడీపీ చేస్తున్న ఆగడాలపై రోజా ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో గతంలో పిన్నెళ్లి మీద దాడి చేశారని.. తాను వెళ్లినప్పుడు నా కారు అడ్డగించారని టీడీపీపై రోజా మండి పడ్డారు. దళిత వ్యక్తి అని చూడకుండా ఎంపీ సురేష్ మీద దాడి చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
రౌడీయిజం చేయటం తన సామాజిక వర్గంతో అందరిని భయభ్రాంతులకు గురిచేయడం టీడీపీకి అలవాటు అని రోజా ఆడిపోసుకున్నారు. మీడియా అండ ఉంది కదా అని అహంకారంతో చంద్రబాబు ప్రవర్తించటం పద్దతి కాదని ఎమ్మెల్యే రోజా అన్నారు.
ఈ రాష్ట్రం కష్టనష్టాలలో ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను చిత్తశుద్ధితో ఒక తండ్రిలాగా అభివృద్ధి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి భగవంతుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.
గడిచిన ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ఏం తప్పు చేయునప్పుడు భయపడాల్సిన అవసరం లేదని రోజా అన్నారు. వారందరూ తప్పు చేశారు కాబట్టి వనికిపోతున్నారని.. అందరు రైడ్స్ లో దొరుకుతున్నారని.. అందుకే భయపడుతున్నారని రోజా చెప్పుకొచ్చాడు.
భవిష్యత్తులో కచ్చితంగా చంద్రబాబునాయుడు లోకేష్ ఆయన క్యాబినెట్ అందరూ జైలుకెళ్లే రోజులు దగ్గర ఉన్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు.