పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. 5 శాతం దాటితే లాక్ డౌన్..!!
భారత దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. కేవలం ఈ ఒక్క రోజుల్లోనే 33 వేలకు పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు అదుపులో ఉండగా ఈ వైరస్ వ్యాప్తి మాత్రం క్రమ క్రమంగా పెరుగుతున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన కార్యాచరణ ప్రకారం తిరిగి వైరస్ ను అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వ్యాక్సినేషన్ తీసుకునే వారి సంఖ్య క్రమ క్రమంగా పెంచాలని చెబుతోంది.
అంతేకాకుండా భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. అయితే మరోవైపు పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే నేటి నుంచి చిన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే వైరస్ కట్టడి చర్యలకు మరింత కృషి చేయాలని చెబుతుంది.
పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేశాయి. ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, బెంగాల్ లాంటి రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. వీటితో పాటు పాఠశాలను కూడా మూసివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇప్పటికే ఉన్నా ఎంటర్టైన్మెంట్ జోన్లను కూడా మూసివేశారు. అంతేకాకుండా ప్రజలకు సంబంధించిన హోటల్స్, రవాణా వ్యవస్థల్లో పలు మార్పులు చేస్తూ అనుమతులు ఇచ్చారు. వీటిలో కేవలం సీటింగ్ ను 50 శాతానికి మాత్రమే పరిమితం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా 50 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. గతంలో వైరస్ కు సంబంధించి పాజిటివ్ రేటు 0.5 శాతం మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇటీవల నమోదైన కేసులను బట్టి చూస్తే ఢిల్లీలో పాజిటివ్ రేటు అమాంతం పెరిగి ఐదు శాతానికి దగ్గర్లో కి వచ్చింది. ఢిల్లీలో పాజిటివ్ రేటు 5 శాతం దాటితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాజధానిలో ఉండే ప్రజలకు సూచించింది.
నిజంగా 5 శాతం దాటితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.
పెరిగిన పాజిటివిటి రేటు ప్రస్తుతం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. పాజిటివ్ రేటు 5 శాతం దాటితే పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాల్సి ఉంటుంది. అంటే గతంలో మాదిరిగానే రాష్ట్రాలు ఆంక్షలను కఠినంగా అమలు చేయడంతో పాటు జన సంచారాన్ని కూడా అడ్డుకునే వీలుంటుంది. ఇదే జరిగితే మొదటిసారిగా లాక్ డౌన్ విధించిన సమయంలో జరిగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.
నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే వీలుంటుంది. జనసంచారంపై పూర్తిస్థాయిలో నిషేధం కొనసాగుతుంది. ఎంటర్టైన్మెంట్ జోన్లుగా ఉన్న బార్లు, రెస్టారెంట్లు, హోటల్స్ పూర్తిస్థాయిలో బంద్ అవుతాయి. పెళ్లి లాంటి శుభకార్యాలకు వచ్చే జనాభా సంఖ్య తగ్గుతుంది. అంత్యక్రియలకు కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ రేటు 5 శాతానికి మించి జరుగుతాయి.