జీహెచ్‌ఎంసీ పోలింగ్ లో రిగ్గింగ్: కాంగ్రెస్
ప్రజల్లో కాంగ్రెస్ ఫేట్ మారిపోయింది. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టలేకపోయింది. నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఇన్ని సమస్యలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓటములపై కారణాలు వెతుక్కుంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల పరాజయాల నేపథ్యంలో కోలుకోలేని పరిస్థితిలో పడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చిన్న సమస్యలను లేవనెత్తి తన రాజకీయ గుర్తింపును నిలుపుకోవటానికి తీరని ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం సాగుతోంది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోల్ శాతం గణాంకాలలో లూప్ హోల్స్ వెతికి ఆయన తప్పును కనుగొన్నారు. ముగిసిన జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్- ఎంఐఎం పార్టీలు రిగ్గింగ్ చేశాయని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోల్ శాతం 60% వరకు, 90% వరకు పెరగడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పోల్ శాతం అకస్మాత్తుగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు, ఇది కేవలం ఒక గంటలో 50% కి పెరిగిందని లెక్కలు బయటపెట్టారు. సాయంత్రం 5 గంటలకు నివేదించిన 38% నుండి ఇంత పెరగడం ఏంటని నిలదీశారు.
"చీఫ్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన గణాంకాలపై బోలెడు అనుమానాలున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అసలు ఓటర్లు లేరని ఎలక్ట్రానిక్ మీడియా చూపిస్తున్న సమయంలో.. సిబ్బంది నిద్రపోతూ కనిపించారని.. మరి అకస్మాత్తుగా పోల్ శాతం ఇలా ఎలా పెరిగింది", అని దాసోజ్ శ్రావణ్ ప్రశ్నించాడు. నిజం బయటపెట్టడానికి, డిసెంబర్ 1న జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల సిసిటివి ఫుటేజీని విడుదల చేయాలని దాసోజ్ శ్రావణ్ ఎస్‌ఇసిని డిమాండ్ చేశారు.
జిహెచ్‌ఎంసిలోని 150 డివిజన్ల పోలింగ్ బూత్ వారీగా ఫుటేజ్ కోసం సెక్షన్ 6(1) కింద ఆయన ఆర్‌టిఐ దరఖాస్తును ఎస్‌ఇసికి దాఖలు చేశానని తెలిపాడు.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పలు ప్రశ్నలను అడిగామని తెలిపారు. లేవనెత్తిన ప్రశ్నల ప్రకారం ఎస్‌ఇసి సరైన సమాచారం ఇస్తే నిజం బయటకు వస్తుందని ఆయన అన్నారు.