• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వ‌ర్మ గెలికేశాడుగా.....

వ‌ర్మ గెలికేశాడుగా.. నోముల భగత్ వీడియోతో సంచలనం!

By - Tupaki Desk
Update: 2021-04-03 06:58 GMT
ప‌బ్లిసిటీని గురిచూసి కొట్ట‌డంలో వ‌ర్మ స్టైలే వేరు. ఆ దెబ్బ అలా ఇలా ఉండ‌దు.. యావ‌త్ మీడియా స్పందించేలా ఉంటుంది. ప్ర‌తీ విష‌యంపై త‌న‌దైన రీతిలో కామెంట్ చేసే వ‌ర్మ‌.. ఆ మ‌ధ్య జీహెచ్ఎంసీ మేయ‌ర్ కుడిచేత్తో కుక్క‌కు భోజ‌నం తినిపిస్తూ.. తాను ఎడ‌మ చేత్తో తింటున్న వీడియోను పోస్టు చేశారు. త‌న‌కు పెడ‌తానంటూ.. తానుకూడా కుక్క‌గా పుడ‌తానంటూ చేసిన కామెంట్ వైర‌ల్ అయ్యింది.

ఇప్పుడు నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక హాట్ హాట్ గా సాగుతున్న వేళ‌.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి సంచ‌ల‌నానికి తెర‌తీశారు. ఆ వీడియోలో భ‌గ‌త్ చురుత పులితో వాకింగ్ కు వెళ్తున్నారు. ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

దీనికి సంబంధించి వ‌రుస ట్వీట్లు చేశాడు ఆర్జీవీ. ‘‘కేసీఆర్‌, కేటీఆర్ టైగ‌ర్లు, సింహాలు అని మ‌న‌కు తెలుసు. కానీ.. నోముల భ‌గ‌త్ చిరుత పులిని వాకింగ్ కు తీసుకెళ్ల‌డం నాకు చాలా బాగా న‌చ్చింది. నాకేగ‌న‌క నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటు ఉంటే.. 17న అత‌నికే వేసేవాణ్ని’’అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో ‘‘నాగార్జున సాగ‌ర్ లో మ‌న గ‌ర్జ‌న‌కు ఏ పార్టీ నిల‌బ‌డ‌లేద‌ని అంటున్నారు నోముల భగత్. చిరుత పులితో ప్ర‌చారంలో పాల్గొంటున్న వ్య‌క్తిని నేను ప్రపంచంలో ఎక్క‌డా చూడ‌లేదు’’ అని రాసుకొచ్చారు వర్మ.

అయితే.. కొందరు ఇది మార్ఫింగ్ వీడియో అని అనుమానిస్తుండగా.. మరికొందరు మాత్రం నిజమైనదేనని అంటున్నారు. చుట్టుపక్కల పరిసరాలు చూస్తుంటే.. ఇది ఆఫ్రికా అడవి ప్రదేశం మాదిరిగా అనిపిస్తోంది. అక్క‌డి ప‌ర్యాట‌కుల‌తో క‌లిసిపోయేలా చిరుత‌ల‌కు ట్రైనింగ్ ఇస్తారు. కాబ‌ట్టి.. భ‌గ‌త్ ప‌ర్యాట‌కం కోసం అక్క‌డికి వెళ్లిన‌ప్పుడు తీసిన వీడియో కావొచ్చ‌‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

VAAMMO we know #KCR and @KTRTRS are TIGER and LION but I love this candidate @BagathNomula who is taking a CHEETAH for a walk ..If I had a VOTE I will vote for this REAL HERO on 17th by-election of Nagarjuna Sagar pic.twitter.com/sYETa51Zq0

— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2021
Tags:    
  • Rgv Tweet 
  • Trs Candidate Bhagath 
  • Nagarjuna Sagar By Polls 
  • Telugu News 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS