• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జీ బ్లాక్ రహస్యం...

జీ బ్లాక్ రహస్యం తేల్చాలి!

By - Tupaki Desk
Update: 2020-07-15 08:30 GMT
సచివాలయం కూల్చివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. జీ బ్లాక్ ఉన్న స్థలాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించి పరిశోధన సాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జీ బ్లాక్ కింద భూగర్భంలోని  రహస్యాలు నిగ్గు తేలాల్సి ఉందన్నారు.

‘ఆపరేషన్ జీ బ్లాక్’ వెనుక భారీ ఆర్థిక దోపిడీకి కుట్ర జరిగిందని ప్రజలు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సచివాలయం కూల్చివేతను అర్ధరాత్రి కేసీఆర్ ఎందుకు ప్రారంభించాడో చెప్పాలని.. గుప్త నిధుల కోసమే ఇలా తవ్వకాలు చేస్తారని రేవంత్ ఆరోపించారు.కూల్చివేత ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసీఆర్ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు అని రేవంత్ ఆరోపించారు.

సచివాలయంలోని జీ బ్లాక్ ను 1888లో ఆరో నిజాం నవాబ్ అలీఖాన్ నిర్మించారని..  దీనిని సైఫాబాద్ ప్యాలెస్ అని పిలిచేవారని రేవంత్ తెలిపారు. ఆనాడు నిజాం రాజ్యం ఆర్థిక వ్యవహారాలు, ట్రెజరీ కార్యకలాపాలు ఈ జీ బ్లాక్లోనే జరిగేవన్నారు. నిజాం రిజర్వ్ బ్యాంక్ గా జీ బ్లాక్ ఉండేదని.. దీని కింద సొరంగాలు బయటపడ్డాయని రేవంత్ తెలిపారు.ఈ బ్లాక్ కింద భూగర్భంలో స్ట్రాంగ్ రూములు నిర్మించినట్టు అనుమానాలున్నాయని జి బ్లాక్ కింద నిజాం నిధి కచ్చితంగా ఉందన్న సంకేతాలు కనిపించాయని.. ఈ వేల కోట్ల సంపద కొల్లగొట్టడానికే సచివాలయం కూల్చివేత అర్ధరాత్రి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సొరంగాలపై పరిశోధనకు పురావస్తుశాఖ అనుమతి కోరినా కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదని.. తాజాగా సచివాలయం కూల్చివేతను రహస్యంగా చేపట్టడాన్ని చూస్తే నిజంకు చెందిన వేల కోట్ల సంపద.. దోపిడీకి స్కెచ్ సిద్ధమైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Tags:    
  • Revanth Reddy 
  • TPCC Chief 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

Copyright @2026

Powered by Blink CMS